ప్రభాస్ ని సరికొత్త లుక్కుతో చూపించబోతున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్

ప్రభాస్ ని సరికొత్త లుక్కుతో చూపించబోతున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్” అనే సినిమా తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కానీ ఈ విషయంలో మాత్రం దర్శకనిర్మాతలు ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” అనే సినిమా షూటింగ్ ను 85% పూర్తి చేసేసారు.

వచ్చే ఏడాది జనవరి కల్లా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ అశ్విన్ దర్శకత్వంలో “ప్రాజెక్ట్ కే” అనే సినిమాతో బిజీ కాబోతున్నారు. ఈ సినిమా కూడా పూర్తయిన తర్వాత ప్రభాస్ అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ వంగా ధర్శకత్వంలో “స్పిరిట్” అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

ఈ సినిమాలో ప్రభాస్ ఒకసారి కొత్త లుక్ తో కనిపించబోతున్నారట. ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే ప్రభాస్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ లుక్కుతో ఉండబోతున్నారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అర్జున్ రెడ్డి వంటి కల్ట్ సినిమా తీసిన సందీప్ ప్రభాస్ తో ఎలాంటి సినిమా చేయబోతున్నారు అని సర్వత్ర ఆసక్తి నెలకొంది.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు