హైదరాబాద్‏లో అటు వైపు వెళ్తున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..

హైదరాబాద్‏లో అటు వైపు వెళ్తున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..

హైదరాబాద్ లోని సైబరాబాద్ పరిధిలో శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షాలు విధించనున్నారు. మైండ్ స్పేస్ జంక్షన్ (రాయదుర్గం మెట్రో స్టేషన్) నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్​ రావు ప్రకటన చేశారు.

బయోడైవర్సిటీ


సైబర్​ టవర్స్ ఫ్లై ఓవర్​ మీదుగా బయోడైవర్సిటీ వైపు వాహనాలను రానివ్వరు. కేపీహెచ్ బీ ఆర్​వోబీ నుంచి సైబర్ టవర్స్​ ఫ్లై ఓవర్​ మీదుగా గచ్చిబౌలి వైపు వచ్చే వెహికల్స్​ సైబర్​ టవర్స్ జంక్షన్, మెటల్ చార్మినార్, సీఐఐ జంక్షన్, కొత్తగూడ జంక్షన్ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకొని వెళ్లాలి. హైటెక్స్ నుంచి సైబర్ టవర్స్, బయోడైవర్సిటీ వైపు వచ్చే వెహికల్స్ సైబర్​ టవర్స్,​ సీవోడీ సిగ్నల్ వద్ద రైట్ టర్న్ తీసుకుని నెక్టార్ గార్డెన్, ఐ ల్యాబ్, ఎన్​సీబీ రోడ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

టెక్ మహీంద్రా

సీఐఐ, టెక్ మహీంద్రా, డెల్​ కంపెనీ రోడ్ నుంచి బయోడైవర్సిటీ, ఇనార్బిట్ మాల్ వైపు వచ్చే వాహనాలను టీసీఎస్​ జంక్షన్ నుంచి లెఫ్ట్, సైబర్​ టవర్స్ వద్ద రైట్ టర్న్ ​తీసుకుని సీవోడీ సిగ్నల్,నెక్టార్​ గార్డెన్, ఐ ల్యాబ్, ఐటీసీ రోడ్​ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. కావూరి హిల్స్​ నుంచి సైబర్​ టవర్స్​, కేపీహెచ్​బీ ఆర్​వోబీ నుంచి సైబర్​ టవర్స్​, సీవోడీ జంక్షన్​, హైటెక్స్ జంక్షన్​నుంచి సైబర్​ టవర్స్, సైబర్​ టవర్స్ నుంచి కొత్తగూడ జంక్షన్, టీసీఎస్​ జంక్షన్ నుంచి సైబర్​ టవర్స్​, ఎన్​ఐఏ నుంచి ఎస్​బీఐ పర్వత్​నగర్​, నీరూస్​ జంక్షన్​నుంచి పర్వత్​నగర్​ వైపు వెళ్లే రద్దీ పెరిగే అవకాశం ఉంది.

ఉదయం 7.30 నుంచి

మాదాపూర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు కేపీహెచ్​బీ ఆర్​వోబీ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ వైపు ఐకియా అండర్ పాస్ మీదుగా వచ్చే వెహికల్స్ సైబర్​ టవర్​ జంక్షన్​, సీవోడీ సిగ్నల్​ వద్ద రైట్ టర్న్ తీసుకుని నెక్టార్ గార్డెన్, ఐ ల్యాబ్స్​, ఐటీసీ కోహినూర్ హోటల్​ మీదుగా వెళ్లాల్సి ఉంటుందని డీసీపీ తెలిపారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు