ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు.. పీఎం మోదీ సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీ..

ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు.. పీఎం మోదీ సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీ..

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు. వరుస భేటీలతో బిజి బిజీగా ఉన్నారు. 3 రోజుల ఢిల్లీ టూర్‌లో ప్రధాని మోదీ సహా పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితులతోపాటు పోలవరం, రాజధాని అంశాలపై కేంద్ర పెద్దలకు రిపోర్ట్‌ ఇవ్వనున్నారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు వరుస భేటీలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అశోక్‌రోడ్‌ నివాసంలో ఏపీ ఎన్డీయే ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈరోజు ఉదయం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఆ తర్వాత.. రక్షణ, హోం, ఉపరితల రవాణా, వాణిజ్య, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖల మంత్రులను కలవనున్నారు. ముందుగా 9గంటలకు కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌ను, 10.15కి ప్రధాని మోదీ, మధ్యాహ్నం 12.15కి నితిన్‌ గడ్కరీ, 2గంటలకు శివరాజ్‌సింగ్‌చౌహాన్‌, 2.45కి కేంద్రమంత్రి అమిత్‌ షాను కలుస్తారు. రేపు.. ఉదయం 9గంటలకు నీతి ఆయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం, 10గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌, 10.45 జేపీ నడ్డా, మధ్యాహ్నం 12.30కి రామ్‌దాస్‌ అథవాలేతో భేటీ అవుతారు సీఎం చంద్రబాబు. పోలవరం, రాజధానిపై నివేదిక ఇవ్వనున్నారు. కేంద్రం పెద్దల దృష్టికి రాష్ట్ర పునర్నిర్మాణానికి సంబంధించిన అంశాలు తీసుకెళ్లనున్నారు. విభజన హామీలతోపాటు ఆర్థిక అంశాలే ప్రధాన అజెండాగా ఈ భేటీ సాగనుంది.

జూలై 3న బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని 50 అశోక్‌రోడ్డులో ఇవాళ ఎన్డీయే ఎంపీలతో భేటీ అయ్యి.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై చర్చించారు. మరి కాసేపట్లో ప్రధాని సహా ఇతర మంత్రులతో భేటీ నేపథ్యంలో వారితో చర్చించాల్సిన విషయాలపై ప్రస్తావించినట్లు తెలుస్తోంది. జూలై 5న ఉదయం నీతి అయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం, నిర్మలా సీతారామన్‌, జేపీ నడ్డా, రామ్‌దాస్‌ అథవాలేతో భేటీ కానున్నారు. కేంద్రప్రభుత్వం ఈ నెల చివరివారంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న వేళ ఏపీ అవసరాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్ళనున్నారు సీఎం చంద్రబాబు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం జరిగేలా కేటాయింపులు జరపాలని కోరనున్నారు. ప్రస్తుతం ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానితోపాటు కేంద్రమంత్రులకు వివరించి.. ఆర్థిక, మౌలిక వసతులకు సాయం చేయాలని కోరనున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై నివేదికలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా.. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌ వేగంగా పూర్తి చేయడంతోపాటు.. ఏపీలోని పలు జాతీయ రహదార్లకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. మొత్తంగా.. కేంద్రప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఢిల్లీ టూర్‌తో కేంద్రం నుంచి ఏపీకి ఎలాంటి సాయం తీసుకొస్తారన్నది కీలకంగా మారుతోంది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు