భద్రత పెంపు.. పవన్‌ కల్యాణ్‌కు వై ప్లస్‌ సెక్యూరిటీ.. బుల్లెట్ ప్రూఫ్ కారు

భద్రత పెంపు.. పవన్‌ కల్యాణ్‌కు వై ప్లస్‌ సెక్యూరిటీ.. బుల్లెట్ ప్రూఫ్ కారు

మొదటి సారి డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్న పవన్‌ కల్యాణ్‌కు భారీ మానవహారంతో ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అమరావతి రైతులు. మరోవైపు.. డిప్యూటీ సీఎం పవన్‌కు భద్రత పెంచింది ప్రభుత్వం. Y ప్లస్ సెక్యూరిటీతో పాటు.. బులెట్ ప్రూఫ్ కార్‌ను పవన్‌కు కేటాయించింది ప్రభుత్వం. బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు పవన్. కాసేపట్లో..

మొదటి సారి డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్న పవన్‌ కల్యాణ్‌కు భారీ మానవహారంతో ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అమరావతి రైతులు. మరోవైపు.. డిప్యూటీ సీఎం పవన్‌కు భద్రత పెంచింది ప్రభుత్వం. Y ప్లస్ సెక్యూరిటీతో పాటు.. బులెట్ ప్రూఫ్ కార్‌ను పవన్‌కు కేటాయించింది ప్రభుత్వం. బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు పవన్. కాసేపట్లో గన్నవరం చేరుకోనున్న పవన్ కల్యాణ్‌ విజయవాడలో డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ పరిశీలించనున్నారు. విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ ఆఫీస్ పవన్‌కు కేటాయించారు. తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీస్‌కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం సచివాలయానికి సచివాలయానికి చేరుకుని రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు.

సెక్యూరిటీ పెంపు..

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న పవన్‌ కల్యాణ్‌కు Y ప్లేస్ కేటగిరి, ఎసకర్ట్ సెక్యూరిటీ పెంచింది ప్రభుత్వం. అలాగే బులెట్ ప్రూఫ్ కారును కూడా కేటాయించనుంది. ఉదయం 9.45 గంటలకు హైదరాబాద్‌ నుంచి గన్నవరం చేసుకోనున్న పవన్‌..10.30 గంటల మధ్య విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు చేరుకోనున్నారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు