నేడు మూడో శ్వేత పత్రాన్ని విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం

నేడు మూడో శ్వేత పత్రాన్ని విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం

ఏపీలో కొలువుదీరన కొత్త ప్రభుత్వం మంగళవారం మూడో శ్వేత పత్రాన్ని విడుదల చేయనుంది. ఇప్పటికే పోలవరం, అమరావతిపై శ్వేత పత్రాలను విడుదల చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మూడో శ్వేత పత్రంగా ఇంధన శాఖ పై విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇంధన శాఖపై నేడు వాస్తవ పరిస్థితులపై శ్వేత పత్రం విడుదల చేయనుంది. గత ప్రభుత్వం ఇంధన శాఖ ను నిర్వీర్యం చేసిన తీరును ఏపీ ప్రభుత్వం వివరించనుంది. ఇంధన శాఖను గాడిలో పెట్టేందుకు తీసుకుంటున్న చర్యల గురించి సర్కార్‌ వివరించనుంది. అలాగే 2019 కి ముందు ఇంధన శాఖ పనితీరు గురించి వివరించనున్న ప్రభుత్వం.. మూడు గంటలకు సెక్రటేరియట్‌లో ఈ పత్రాన్ని విడుదల చేయనుంది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు