పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్‌ ప్రదీప్‌?

పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్‌ ప్రదీప్‌?

ఇండస్ట్రీలో ఉన్న స్టార్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు పేరు ముందే ఉంటుంది. చిన్న చిన్న షో లతో మొదలుపెట్టి కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను, సర్కార్ వంటి హిట్ షోల వరకు ఎన్నో షోలకి హోస్ట్ గా చేసిన ప్రదీప్ మాచిరాజు బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. ఒకవైపు టీవీ ఇండస్ట్రీలో మాత్రమే కాక మరోవైపు సినీ ఇండస్ట్రీలో కూడా తన ప్రతిభను చాటుతూనే ఉంటారు. “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?” సినిమాతో హీరోగా కూడా ప్రయత్నించిన ప్రదీప్ మాచిరాజు కి లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.

అయితే ఎప్పటికప్పుడు తన పెళ్లి రూమర్స్ తో ప్రదీప్ వార్తలు లో నిలుస్తూనే ఉంటాడు. కానీ తన పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటిదాకా ఇంకా బయటకు రాలేదు. తాజా సమాచారం ప్రకారం ఈసారి ప్రదీప్ నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య తో ప్రదీప్ ప్రేమలో ఉన్నాడని ఆమెను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తోంది.

నవ్య ప్రదీప్ కి పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసేది. వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఇక వీరి ప్రేమ విషయం ఇద్దరి ఇంట్లో కూడా తెలిసి వాళ్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో ఇప్పుడు వీరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రదీప్ తన పెళ్లి గురించి ప్రకటించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రదీప్ తో పాటు నవ్య బిగ్ బాస్ కంటెస్టెంట్లకు కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తుంది.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు