యుద్ధానికి సిద్ధం

యుద్ధానికి సిద్ధం

ప్రభాస్ నటిస్తున్న ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’లో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన ‘అశ్వత్థామ’గా నటిస్తున్నట్టు ఇప్పటికే రివీల్ చేశారు. తాజాగా ఆయన పాత్రకు సంబంధించి కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ‘అశ్వత్థామ.. యుద్ధానికి సిద్ధం’ అంటూ విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమితాబ్ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ లుక్‌‌‌‌‌‌‌‌లో కనిపించారు.

యుద్దభూమి మధ్య నుదుటిపై ఒక దివ్య రత్నాన్ని ధరించి, చేతిలో అస్త్రంతో యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా ఆయన కనిపించారు. బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో ఓ పెద్ద వెహికల్‌‌‌‌‌‌‌‌తో పాటు కొంతమంది వ్యక్తులు నేలపై పడివుండటం ఆసక్తిని పెంచుతోంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌. ఈ నెల 10న ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేయనున్నారు. జూన్ 27న వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అశ్వనీదత్ భారీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో నిర్మిస్తున్నారు.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు