బంపర్ ఆఫర్.. హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన సోషల్ మీడియా బ్యూటీ‌..

బంపర్ ఆఫర్.. హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన సోషల్ మీడియా బ్యూటీ‌..

కొంతమంది మాత్రం తమ యాక్టింగ్ స్కిల్స్, డాన్స్ లతో నెటిజన్స్ ను ఆకట్టుకుంటూ ఫెమస్ అవుతున్నారు. ఇక ఇదే క్రేజ్ తో ఇండస్ట్రీకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. పలు టీవీ షోల్లో అవకాశాలు అందుకున్నారు కొందరు. మరికొందరు ఏకంగా సినిమాల్లోనే కనిపించారు. ముఖ్యంగా అమ్మాయిలు చాలా మంది ఇలా ఇండస్ట్రీలోకి వచ్చారు. దీపికా పిల్లి, వైష్ణవి చైతన్య, అషు రెడ్డి ఇలా చెప్పుకుంటూ పొతే చాలా మందే ఉన్నారు.

సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. సోషల్ మీడియాలో వాడకం ఎక్కువైన దగ్గర నుంచి ఎవరు ఎందుకు ఫెమస్ అవుతున్నారో అర్ధం కావడంలేదు. పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ కొంతమంది పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది బూతులు మాట్లాడుతూ.. బోల్డ్ వీడియోలు చేస్తూ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది మాత్రం తమ యాక్టింగ్ స్కిల్స్, డాన్స్ లతో నెటిజన్స్ ను ఆకట్టుకుంటూ ఫెమస్ అవుతున్నారు. ఇక ఇదే క్రేజ్ తో ఇండస్ట్రీకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. పలు టీవీ షోల్లో అవకాశాలు అందుకున్నారు కొందరు. మరికొందరు ఏకంగా సినిమాల్లోనే కనిపించారు. ముఖ్యంగా అమ్మాయిలు చాలా మంది ఇలా ఇండస్ట్రీలోకి వచ్చారు. దీపికా పిల్లి, వైష్ణవి చైతన్య, అషు రెడ్డి ఇలా చెప్పుకుంటూ పొతే చాలా మందే ఉన్నారు.

తాజాగా మరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌ కూడా ఇప్పుడు సినిమాల్లోకి అడుగు పెడుతుంది. ఆమె పేరు నిహారిక.. ఈమె గురించి చాలా మందికి తెలుసు. సినిమా వాళ్ళతో రకరకాల వీడియోలు చేసి క్రేజ్ సొంతం చేసుకుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చాలా మంది సెలబ్రిటీలతో ఆమె వీడియోలు చేసింది. పైగా నిహారిక వీడియోలు చేసిన స్టార్స్ మామూలు వాళ్ళు కాదు.. మహేష్ బాబు, రాకింగ్ స్టార్ యష్ , రణబీర్ కపూర్ ఇలా పెద్ద పెద్ద హీరోలతో మూవీ ప్రమోషన్స్ చేసింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. నిహారిక హీరోయిన్ గా ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. అయితే ఈమేరకు గీత ఆర్ట్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. కానీ సినిమా వివరాలు ఏమీ వెల్లడించలేదు. త్వరలోనే దీని పై అప్డేట్స్ రానున్నాయి. కాగా నిహారిక చాలా ఫెమస్.. సినిమా స్టార్స్ సైతం ఆమెను ఇన్ స్టా గ్రామ్ లో ఫాలో అవుతుంటారు. సమంత, నయన తార, లక్ష్మీ మంచు, నాగ చైతన్య, తమన్నా, వర్ష బొల్లమ్మ ఇలా చాలా మంది నిహారికాను ఫాలో అవుతున్నారు. అంతే కాదు ఆమె పలు యాడ్స్ లోనూ నటించింది. ఇక ఇప్పుడు హీరోయిన్ అవతారమెత్తనుంది. మరి ఈ అమ్మడు హీరోయిన్ గా ఎలాంటి సక్సెస్ లు అందుకుంటుందో చూడాలి.

Please follow and like us:
క్రీడలు వార్తలు