అభివృద్ధి అంతా మీర్ఖాన్‌పేట చుట్టే

అభివృద్ధి అంతా మీర్ఖాన్‌పేట చుట్టే

విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి : భవిష్యత్తులో అభివృద్ధి మీర్ఖాన్‌పేటలోనే ఉంటుందని…

ఫార్మా పరిశ్రమలకు భూములు కోల్పోతున్న 14వేల ఎకరాల రైతుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మీర్కాన్‌పేటలో అమెజాన్‌ వెబ్‌సర్వీస్‌ డేటా సెంటర్‌ డెలివరీ ఆధ్వర్యంలో రూ.కోటితో చేపట్టిన అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలతో ఈ గ్రామం పెద్ద పట్టణంగా మారుతోందన్నారు. డేటాసెంటర్‌ ఏర్పాటుతో నిరుద్యోగులకు జాబ్స్‌ లభిస్తాయని, శరవేగంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో సృజనను వెలికితీసేందుకు ఇన్‌స్ఫైర్లు ఏర్పాటు నిర్వహిస్తామన్నారు. అమెజాన్‌ సంస్థ పాఠశాలను అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని మంత్రి తెలిపారు. ‘బడిని గుడిలా చూడాలి. పాఠశాలలను కాపాడాలి’ అనే తరహాలోనే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

నిరుద్యోగులకు ఇంద్రారెడ్డి ట్రస్ట్‌ చేయూత
మహేశ్వరం నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఇంద్రారెడ్డి ట్రస్ట్‌ చేయూతనిస్తోందని మంత్రి సబితారెడ్డి తెలిపారు. బైరాగూడలోని నిషితా ఇంజినీరింగ్‌ కళాశాలలో ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ శిక్షణ తరగతులను మంత్రి పరిశీలించారు. 160 మందికి శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు మంత్రికి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి కుటుంబానికి ఆసరాగా నిలవాలన్నారు. అనంతరం బేగరికంచ వరకు నిర్మించిన బీటి రోడ్డును ప్రారంభించారు. 70మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి, ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు, ఆర్డీవో సూరజ్‌కుమార్‌, ఏఎంసీ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, ప్యాక్స్‌ చైర్మన్‌ డి.చంద్రశేఖర్‌, వైస్‌ఎంపీపీ శమంతప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, ఎంపీటీసీలు సురేష్‌, ఇందిరదేవేందర్‌, రాములు, యాదయ్య, సర్పంచ్‌లు ఇందిరదశరథ్‌, నరేందర్‌గౌడ్‌, శ్రీనివాస్‌, సాయిలు, శ్రీనివాసచారి, బి.జ్యోతి, సరళమ్మ, అనితశ్రీనివాస్‌, నాయకులు లక్ష్మీనర్సింహారెడ్డి, జయేందర్‌, ప్రభాకర్‌రెడ్డి, సదానంద్‌గౌడ్‌, రాజేందర్‌రెడ్డి, బిక్షపతి, కార్తీక్‌, దీక్షీత్‌రెడ్డి, ఆనంద్‌, ప్రకాశ్‌రెడ్డి, ప్రశాంత్‌చారి, లచ్చ్యానాక్‌, దామోదర్‌గౌడ్‌, పాండుగౌడ్‌, రేవంత్‌రెడ్డి, మేఘనాథ్‌రెడ్డి, వెంకటేష్‌, కె.విఘ్నేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు