గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్.. 33 మంది ఎలిమినేషన్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్.. 33 మంది ఎలిమినేషన్

నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మూడో రోజు కొనసాగుతోంది. ప్రస్తుతం ఎలిమినేట్ ప్రక్రియ నడుస్తోంది. ఇప్పటి వరకు 33 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. కౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18 వేల 696 ఓట్ల లీడ్ లో ఉన్నారు.

గెలుపు కోసం లక్షా, 55 వేల 95 ఓట్లు కావాల్సి ఉంది. తీన్మార్ మల్లన్న విజయానికి మరో 31 వేల 885 ఓట్లు కావాల్సి ఉంది. కౌంటింగ్ ఆలస్యం అవుతుండడంతో మరో మూడు టేబుల్స్ ఏర్పాటు చేశారు సిబ్బంది. దీంతో కౌంటింగ్ ప్రక్రియ స్పీడ్ కానుంది. మధ్యాహ్నంలోపే తుది ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Please follow and like us:
తెలంగాణ వార్తలు