రక్తానికి మరిగిన రహదారి.. ఈ రోడ్డు దుస్థితి మారేదెన్నడు?

రక్తానికి మరిగిన రహదారి.. ఈ రోడ్డు దుస్థితి మారేదెన్నడు?

పేరుకు అది పెద్ద రోడ్డు.. తెలంగాణ నుంచి రెండు రాష్ట్రాలను కలిపే అంతర్‌ రాష్ట్ర రహదారి.. కానీ ప్రమాదాలకు నెలవుగా మారింది. ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఇంతకీ ఆ రహదారి ఎక్కడ ఉంది.? ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

అడుగుకో గొయ్యి…గజానికో గుంత..చాలా చోట్ల కంకర తేలిన దారి..ఇది తెలంగాణ నుండి,రెండు రాష్ట్రాలను కలిపే అంతర్ రాష్ట్ర రహదారి పరిస్థితి..అధ్వానంగా మారిన ఆ రోడ్డు పై ఒక్క కిలోమీటర్ ప్రయాణిస్తే చాలు ఒళ్లు హూనమవ్వడం ఖాయం. ఇక చిన్న వర్షంపడితే ఎక్కడ గుంత ఉందో అర్ధంకాదు. ఇది జహీరాబాద్ టు బీదర్ రోడ్డు పరిస్థితి. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు వెళ్లే జహీరాబాద్ టు బీదర్ రహదారి పూర్తిగా శిథలావస్థకు చేరింది. అటు కర్ణాటక, మహారాష్ట్రలను కలిపే రోడ్డు కావడంతో ఈ రోడ్డు పై హెవీ వెయిట్ ఉన్న వాహనాల రాకపోకలు కూడా ఎక్కువగానే ఉంటాయి.

అయిన కూడా ఈ రోడ్డు మరమ్మతులకు మాత్రం నోచుకోవడం లేదు. జహీరాబాద్ నుండి బీదర్ వరకు సుమారు 35 కిలోమీటర్లు ఉన్న రోడ్డు పూర్తిగా గుంతలమయం అయ్యింది .హైదరాబాద్ నుంచి వచ్చే కర్ణాటక వెళ్లే బస్సులు అన్ని ఈ రహదారి గుండానే వెళ్ళాలి. ఇదే రోడ్డు గుండా వెళ్తే కర్ణాటకతో పాటు మహారాష్ట్ర కూడా వెళ్ళవచ్చు. మరో వైపు బీదర్ నుండి నిత్యం హైదరాబాద్ కి వెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది.. బుస్సుల్లోనే కాకుండా ప్రైవేట్ వాహనాల్లో కూడా ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు ప్రయాణికులు. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు పూర్తిగా ద్వంసం కావడంతో ఈ రోడ్డు పై ప్రయాణం చేయడం అంటేనే వణికిపోతున్నారు.

ఇక జహీరాబాద్ నుంచి కర్ణాటక బార్డర్ వరకు ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఈ రోడ్డుతో ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు బీదర్‌లో ఉన్న ఆసుపత్రులకు జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎక్కువగా వెళ్తుంటారు. ఆయా ఆసుపత్రిలకు వెళ్లే వారికి ఈ రోడ్డు పెద్ద ఇబ్బందిగా మారింది. ఇక ఈ రోడ్డు పై ఉన్న గుంతల్లో పడి వాహనాలు కూడా పాడైపోతున్నాయి అంటున్నారు వాహనదారులు..ఇక రోడ్డు పై ప్రమాదాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి.. రోడ్డు పూర్తిగా ధ్వసం కావడంతో అతి వేగంగా వచ్చిన వాహనాలు గుంతల్లో పడి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కోటుంటున్నాయి..ఈ రహదారి పై ఆరు నెలలో 15 ప్రమాదాలు జరగగా అందులో 10 మంది చనిపోయారు.

ఇటీవలే న్యాల్​కల్ మండలం గణేశ్​పూర్ వద్ద ద్విచక్ర వాహనాన్ని కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పొలం పనులకు వెళ్లి రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని బస్సు వేగంగా ఢీకొట్టడంతో గణేశ్​పూర్​కు చెందిన సిద్ధ రామప్ప(71) అతని కుమార్తె రేణుక(36), అల్లుడు జగన్నాథ్(41) సహా మనవడు వినయ్ కుమార్(15) మృతి చెందారు. ప్రమాదంలో అక్కడికక్కడే సిద్ధ రామప్ప మృతిచెందగా తీవ్రంగా గాయపడిన జగన్నాథ్, రేణుక, వినయ్ కుమార్ కర్ణాటకలోని బీదర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. రేణుక,జగన్నాథ్ ఇద్దరు ప్రమాదంలో చనిపోవడంతో వారి ఇద్దరు అమ్మాయిలు తల్లిదండ్రులకు దూరం కాగా..సిద్దిరామప్ప మృతితో ఇంటి పెద్దను కోల్పోయి ఓ కుటుంబం రోడ్డున్న పడింది.

ఇలా చాలా ప్రమాదాలు జరిగిన కూడా, అధికారులు మాత్రం ఈ రోడ్డును పట్టించుకోవడం లేదు. తెలంగాణ,కర్ణాటక, మహారాష్ట్ర ఈ మూడు రాష్ట్రలను కలిపే ఈ అంతర్ రాష్ట్ర రహదారిని నాలుగు వరుసల రహదరిగా ఎప్పుడో మార్చల్సి ఉండేది..పోనీ ఉన్న రెండు వరుసలో రహదారి అయిన, గుంతలు లేకుండా మరమ్మతులు చేస్తూ ఉండాలి, కానీ మరమ్మతులు ఆనేది లేనే లేదు. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు చుట్టూ పక్కల గ్రామస్థులు ఆందోళన చేసి గొడవ చేయగానే.. ఏదో నామమాత్రంగా గుంతల్లో మట్టిని నింపి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది.

ఈ రహదారిని జాతీయ రహదారిగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన పూర్తి వివరాలతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్‌అండ్‌బీ శాఖ, కేంద్రానికి లేఖ రాసినట్లు సమాచారం.. కానీ అది ముందుకు సాగలేదు. ఇక ఈ జహీరాబాద్‌-బీదర్‌ రోడ్డుపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ నుంచి ప్యాసింజర్‌, గూడ్స్‌ ఇతర వాహనాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు వెళ్తుంటాయి. వందలాది వాహనాలతో ఈ రహదారి రద్దీగా ఉంటుంది. జహీరాబాద్‌ నిమ్జ్‌ మధ్యలో నుంచి ఈ రోడ్డు వెళ్తుంది కాబట్టి ఈ రోడ్డును డెవలప్ చేసి..నాలుగు వరసలుగా మారిస్తే,తద్వారా పారిశ్రామిక అభివృద్ధికి ఉపకరిస్తుందని. అంటున్నారు స్థానికులు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు