వైయస్ఆర్‎కు నివాళులు అర్పించనున్న జగన్, షర్మిల.. 75వ జయంతి వేడుకలకు సీఎం రేవంత్..

వైయస్ఆర్‎కు నివాళులు అర్పించనున్న జగన్, షర్మిల.. 75వ జయంతి వేడుకలకు సీఎం రేవంత్..

ఏపీలో వైయస్సార్‌ 75వ జయంతి వేడుకలు ఇంట్రస్టింగ్‌గా మారుతున్నాయి. ఇడుపులపాలయలో వైయస్సార్‌ ఘాట్‌ దగ్గర నివాళులు అర్పించనున్నారు వైఎస్ జగన్‌, షర్మిల. ఉదయం పులివెందుల నుంచి 7.30 బయలుదేరి 8.00 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్దకు చేరుకుంటారు వైఎస్ జగన్. అక్కడ డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 75 వ జయంతి సందర్భంగా వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం కడప ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లనున్నారు. అక్కడి నుంచి బయలుదేరి నేరుగా 10.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. అక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలోని వేడుకల్లో పాల్గొంటారు. ఇక.. 8.30 గంటలకు వైయస్సార్‌ ఘాట్‌కు చేరుకుని నివాళులు అర్పించనున్నారు వైఎస్ఆర్ తనయ, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. ఆమెతో పాటూ తల్లి విజయమ్మ కూడా వైఎస్ఆర్ ఘాట్‎కు చేరుకుని నివాళులు అర్పిస్తారని తెలుస్తోంది. అయితే.. గత మూడేళ్లుగా అన్నాచెల్లెళ్ల వేర్వేరుగానే నివాళులు అర్పిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ ఫోరు జరిగింది. ఈ క్రమంలో.. వైయస్సార్‌ జయంతి కార్యక్రమానికి జగన్‌, షర్మిల కలిసి వస్తారా?.. లేదా? అన్నదానికి తెరపడింది. మరోవైపు.. విజయమ్మ ఎపిసోడ్‌ కూడా ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే.. షర్మిలతో కలిసి కడప జిల్లాకు చేరుకున్న విజయమ్మ.. జగన్‌ నివాళులు అర్పించే సమయానికి ఇడుపులపాయలో ఉంటారా? కొడుకుతో కలిసి నివాళులు అర్పిస్తారా లేక కూతురు వెంట ఉంటారా అన్నది హాట్ టాపిక్‎గా మారింది.

ఇదిలావుంటే.. ఏపీ కాంగ్రెస్‌ సారథ్యంలో జరిగే మహానేత జయంతి కార్యక్రమానికి మహామహులు హాజరుకానున్నారు. ఏపీలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఆ దిశగా కాంగ్రెస్ అధినాయకత్వం ఓ రోడ్ మ్యాప్‌ను కూడా రూపొందించుకున్నట్టు కనిపిస్తోంది. పార్టీ బలోపేతానికి ఉపయోగపడే ఏ సందర్భాన్నీ వదులుకోవద్దనే ఉద్దేశంతో ఉన్న కాంగ్రెస్.. దివంగత మహానేత వైఎస్ 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించబోతోంది. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న ఈ వేడుకల్లో పలువురు కాంగ్రెస్‌ కీలక నేతలు పాల్గొననున్నారు. వైయస్‌ జయంతి వేడుకలకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ షర్మిల స్వయంగా ఆహ్వానించారు. అందులో భాగంగానే.. ఇవాళ వైయస్సార్‌ జయంతి వేడుకల్లో పాల్గొంటారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. జూలై 8న ఉదయం హైదరాబాద్‌ నుంచి మంగళగిరికి వెళ్లనున్నారు. ఇక.. వైయస్సార్‌ జయంతి వేళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. 2029లో ఏపీలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఆ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు. తనతో చాలా మంది టచ్‌లో ఉన్నారని.. కొందరు కాంగ్రెస్‌లోకి రావడానికి ఆసక్తిచూపుతున్నారని తెలిపారు కేవీపీ రామచంద్రరావు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు