కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లిన ఘటన విని ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే డిపో నుండి రెండు కిలో మీటర్ల దూరంలో సోఫీ నగర్ వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. దాంతో అక్కడే నిలిచిపోయింది. అది గమనించిన ఆర్టీ సెక్యూరిటీ సిబ్బంది వెంబడించారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే, ఇక్కడ ఏం జరిగిందంటే..
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపోలో చోరీ కలకలం రేపింది. సెప్టెంబర్ 22న అర్ధరాత్రి సమయంలో ఆర్టీసీ బస్సు చోరీకి గురికావడం అందరినీ షాక్ అయ్యేలా చేసింది. దీంతో అధికారులు, సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లిన ఘటన విని ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే డిపో నుండి రెండు కిలో మీటర్ల దూరంలో సోఫీ నగర్ వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. దాంతో అక్కడే నిలిచిపోయింది. అది గమనించిన ఆర్టీ సెక్యూరిటీ సిబ్బంది వెంబడించారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే, ఇక్కడ ఏం జరిగిందంటే..
మహారాష్ట్రకు చెందిన గణేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఆర్టీసీ డిపో గోడదూకి లోపలిని ప్రవేశించాడు. తాగిన మైకంలో ఆర్టీసీ బస్సును తీసుకెళ్లాడు. అక్కడి నుంచి సోఫీ నగర్ వైపు వెళ్ళగా కంచరోని చెరువు సమీపంలో బస్సు ప్రమాదానికి గురైంది. గమనించిన స్థానికులు వెంటనే ఆర్టీసీ కార్యాలయానికి సమాచారం అందించారు.. ఆర్టీ సెక్యూరిటీ సిబ్బంది వెంబడించి కడ్తాల్ గ్రామ సమీపంలో బైపాస్ దగ్గర అతడిని పట్టుకున్నారు. కాగా, పోలీసుల విచారణలో బస్సు ఆగి ఉంటే తీసుకొచ్చానని నిందితుడు చెప్పినట్టుగా తెలిసింది.