ఇంగ్లండ్ ఘన విజయంతో WTC పాయింట్ల పట్టికలో మార్పులు.. టీమిండియా ర్యాంక్ ఎంతంటే?

ఇంగ్లండ్ ఘన విజయంతో WTC పాయింట్ల పట్టికలో మార్పులు.. టీమిండియా ర్యాంక్ ఎంతంటే?

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది లార్డ్స్‌ వేదికగా జరిగిన ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో కూడా మార్పులు జరిగాయి. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ మరింత లాభపడగా, వెస్టిండీస్ మాత్రం మరింత కిందకు దిగజారింది. అయితే భారత జట్టు అగ్రస్థానానికి ఎలాంటి ఢోకా రాలేదు. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 68.51 శాతం విజయాలతో టీమ్ ఇండియా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో భారత్ తర్వాత ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆసీస్ విజయాల శాతం 62.50గా ఉంది. అంటేభారత్, ఆస్ట్రేలియాల మధ్య అంతరం పెద్దగా లేదు. ఇక మాజీ ఛాంపియన్ న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఈ పట్టికలో మూడవ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆ జట్టు విజయాల శాతం 50. శ్రీలంక జట్టు గెలుపు శాతం కూడా 50 గానే ఉంది. కానీ లంకేయులకంటే న్యూజిలాండ్ ముందు స్థానంలో ఉంది. ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో వెస్టిండీస్ తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌కు ముందు వెస్టిండీస్ విజయ శాతం 33.33గా ఉండగా, ఇప్పుడు అది 26.66కి తగ్గింది. ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు ఆరో స్థానంలో కొనసాగుతోంది.

తొలి టెస్టులో వెస్టిండీస్‌ను ఇన్నింగ్స్ తేడాతో ఓడించిన ఇంగ్లండ్ జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచినా గెలుపు శాతం పెరిగింది. గతంలో ఆ జట్టు విజయాల శాతం 17.50 కాగా, ఇప్పుడు అది 25కి పెరిగింది. అయితే రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధించగలిగితే ర్యాంకింగ్‌ పెరుగుతుంది. అంటే ఇంగ్లండ్ నేరుగా ఐదో లేదా ఆరో స్థానానికి వెళ్లే అవకాశం ఉంది

కాగాలార్డ్స్ మైదానంలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఆండర్సన్ తన వీడ్కోలు మ్యాచ్‌ని ఆడాడు. ఈ మ్యాచ్‌లో జిమ్మీ 26.4 ఓవర్లు వేసి మొత్తం 4 వికెట్లు పడగొట్టాడు. లార్డ్స్ మైదానంలో అరంగేట్రం చేసి కెరీర్ ప్రారంభించిన జేమ్స్ అండర్సన్.. అదే మైదానంలోనే వీడ్కోలు పలకడం విశేషం. టెస్టు క్రికెట్ చరిత్రలో 700+ వికెట్లు తీసిన ఏకైక ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్. 350 టెస్టు ఇన్నింగ్స్‌లలో 704 వికెట్లు తీసి చెరగని ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇన్ని ప్రపంచ రికార్డులతో స్వింగ్ మాస్టర్ తన 41వ ఏట అంతర్జాతీయ కెరీర్‌ను ముగించాడు.

Please follow and like us:
క్రీడలు వార్తలు