సుమారు 6 అడుగులకు మించి ఉన్న ఈ నాగును చూసిన స్థానికులు, షటిల్ క్రీడాకారులు భయంతో పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పామును బంధించారు. కన్నంలోకి బయటపడ్డ నాగు.. తొలుత అతన్ని ముప్పు తిప్పలు పెట్టింది. అంత ఎత్తుకు ఎగురుతూ
విశాఖలో గోధుమ నాగు హల్‌చల్ చేసింది. స్థానిక గాజువాక షటిల్ కోర్టు వద్ద ఓ గోడకు ఉన్న కన్నంలో దూరిన గోధుమ నాగు స్థానికుల్ని హడలెత్తించింది. సుమారు 6 అడుగులకు మించి ఉన్న ఈ నాగును చూసిన స్థానికులు, షటిల్ క్రీడాకారులు భయంతో పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పామును బంధించారు. కన్నంలోకి బయటపడ్డ నాగు.. తొలుత అతన్ని ముప్పు తిప్పలు పెట్టింది. అంత ఎత్తుకు ఎగురుతూ అతన్ని భయపెట్టింది. ఎట్టకేలకు పామును బంధించిన స్నేక్ క్యాచర్ ఓ సంచిలో వేసుకుని సమీపం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.