గోదారోళ్లా.. మజాకా.. 50 రకాల ఫుడ్ ఐటమ్స్‌తో వర సిద్ధి వినాయక అన్న సంతర్పణ.. వీడియో వైరల్

గోదారోళ్లా.. మజాకా.. 50 రకాల ఫుడ్ ఐటమ్స్‌తో వర సిద్ధి వినాయక అన్న సంతర్పణ.. వీడియో వైరల్

ఈ ఏడాది వినాయక చవితిని సెప్టెంబర్ 7వ తేదీన జరుపుకున్నారు. చవితి నుంచి పది రోజుల పాటు గణపతి ఉత్సవాలను ఊరూ వాడా ఘనంగా జరుపుకున్నారు. ఈ రోజు గణపతి నిమజ్జనం చేస్తున్నారు. మండపాలలో గణపతి పూజ చేయమే కాదు వివిధ ప్రాంతాల్లో అన్న వితరణ కార్యక్రమం నిర్వహిస్తారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో కోనసీమ జిల్లలో జరిగిన గణపతి ఉత్సవాలకు సంబంధించింది.

హిందూ మతంలో వినాయకుడిది ప్రత్యెక స్థానం. విఘ్నాలకు అధిపతి వినాయకుడికి ప్రధమ పూజను చేస్తారు. గణపతి ప్రార్ధన, పూజ లేకుండా ఎటువంటి పూజ, శుభకార్యం మొదలు పెట్టరు. శివపార్వతుల ముద్దుల తనయుడు గణపతి జన్మ దినోత్సవాన్ని భాద్రప్రద మాసం, శుక్ల పక్షం చవితి తిధిన జరుపుకుంటారు. ఈ ఏడాది వినాయక చవితిని సెప్టెంబర్ 7వ తేదీన జరుపుకున్నారు. చవితి నుంచి పది రోజుల పాటు గణపతి ఉత్సవాలను ఊరూ వాడా ఘనంగా జరుపుకున్నారు. ఈ రోజు గణపతి నిమజ్జనం చేస్తున్నారు.

మండపాలలో గణపతి పూజ చేయమే కాదు వివిధ ప్రాంతాల్లో అన్న వితరణ కార్యక్రమం నిర్వహిస్తారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో కోనసీమ జిల్లలో జరిగిన గణపతి ఉత్సవాలకు సంబంధించింది. అమలాపురం నల్లచెరువు గ్రామంలో వర సిద్ధి వినాయక ఆలయం వద్ద చవితి ఉత్సవాల సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్న వితరణ కార్యక్రమంలో భక్తుల కోసం ఏకంగా 50 రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి.

శ్రీ సిద్ధి వినాయక అన్న సంతర్పణలో స్వీట్స్, వివిధ రకాల ఆహర పదార్ధాలు, కూరలు వంటి ఫుడ్ ఐటమ్స్ దాదాపు 50 రకాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కోనసీమ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. గణపతి కూడా ఇంట్లో ఒక సభ్యుడే.. పుట్టిన రోజు వేడుకల్లో ఆ మాత్రం ఆహారం అందించాలి అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు