తిరుచానూరు ఆలయంలో ఈ నెల 16న వరలక్ష్మీవ్రతం.. అమ్మవారి ఆర్జిత సేవలు రద్దు..

తిరుచానూరు ఆలయంలో ఈ నెల 16న వరలక్ష్మీవ్రతం.. అమ్మవారి ఆర్జిత సేవలు రద్దు..

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారి ఆలయంలో ఆర్జితసేవలైన అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, వేదాశీర్వచనం, బ్రేక్ దర్శనం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీవ్రతం నిర్వహణకు టీటీడీ ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 16 న శుక్రవారం వరలక్ష్ష్మీ వ్రతం వైభవంగా జరపనుంది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది టిటిడి. వరలక్ష్మి వ్రతం రోజు తెల్లవారుజామున మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించనున్న అర్చకులు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలోని ఆస్థాన మండపంలో వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరపనున్నారు. ఈమేరకు వ్రతం నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ టిటిడి అందజేయనుంది.

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారి ఆలయంలో ఆర్జితసేవలైన అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, వేదాశీర్వచనం, బ్రేక్ దర్శనం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. మహామంగళ దేవత గా లక్ష్మీ అవతారమై వెలసిన అలమేలు మంగమ్మ తిరుచానూరు ఆలయంలో జగత్కల్యాణం కోసం అవతరించిందని భావించే భక్తులు వరలక్ష్మీ వ్రతంలో పాల్గొంటే విశేష ఫలాలు చేకూరుతాయని నమ్మకం.

వ్రతం చేసే రోజున ఉదయాన్నే మంగళ స్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించి ఆలయంలో అర్చకులు ఏర్పాటుచేసిన మండపంలో కొలువైన వరలక్ష్మీ దేవిని దర్శిస్తారు. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఆభరణాలను అలంకరిస్తారు. లక్ష్మీమాతను పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం అర్చకులు ఆవాహనం చేసి షోడశోపచార పూజలు చేస్తారు. రక్ష కట్టిన తరువాత పసుపు, కుంకుమ, పూలతో వ్రతాన్ని సుసంపన్నం గావించి, వ్రతమహత్యం కథను అర్చకులు పటిస్తారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు