ప్రస్తుతకాలంలో చాలామంది కొలెస్ట్రాల్ తోపాటు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.. ఒబేసిటి గుండెతోపాటు పలు అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. అయితే.. నడుము, వీపు భాగంలో పెరిగే కొవ్వు శరీర ఆకృతిని పూర్తిగా పాడుచేస్తుంది.. అటువంటి పరిస్థితిలో ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి పసుపు టీ మంచి హోం రెమెడీగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి పసుపును మన దేశంలో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. పసుపులోని లక్షణాలు, ఔషధ గుణాల కారణంగా దీనిని సూపర్ ఫుడ్ గా చెబుతారు. పసుపును శక్తివంతమైన సహజ యాంటీబయాటిక్ గా పేర్కొంటారు.. దీనిని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.. పసుపును వంట, సౌందర్య సాధనాలు, ఔషధాలలో ఉపయోగిస్తారు. అయితే ఇది నడుము కొవ్వును తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
పసుపులో అనేక పోషకాలు ఉన్నాయి..
పసుపులో పొటాషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు ఉన్నాయి..పసుపు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా బరువు తగ్గడంలో కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుందని డైటీషియన్లు చెబుతున్నారు. ప్రతిరోజూ ఒక కప్పు పసుపు టీ తాగితే.. ఇది మీ బరువును అద్భుతంగా తగ్గిస్తుందంటున్నారు..
పసుపు టీ ఎలా తయారు చేయాలి?
ఒక పాత్రలో కొంచెం నీరు తీసుకోండి. అందులో అల్లం.. పసుపు పొడిని కొంచెం పరిమాణంలో కలపండి. కాసేపు మరగనివ్వండి.. ఆ తర్వాత ఫిల్టర్ చేసి టీ లా తాగండి.. మీ రుచికి తగినట్లు కొంచెం నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు..
పసుపు టీ ప్రయోజనాలను తెలుసుకోండి..
శరీరంలో ఏదైనా రకమైన ఇన్ఫెక్షన్ ఉంటే, దానిని తొలగించడంలో పసుపు టీ సహాయపడుతుంది.
ఈ టీ మెటబాలిక్ సిండ్రోమ్‌ను నివారిస్తుంది. ఈ సిండ్రోమ్ ఊబకాయానికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. జీవక్రియ మార్పుల వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుంది.
టర్మరిక్ టీ.. కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.
ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ బాగా జరగడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందిస్తున్నాము. ఏమైనా సందేహాలు ఉన్నా.. లేదా పాటించే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోండి..)