తిరుపతి జిల్లావాసులకు పోలీసుల హెచ్చరిక.. ఆ తప్పు చేస్తే భారీగా జరిమానా!

తిరుపతి జిల్లావాసులకు పోలీసుల హెచ్చరిక.. ఆ తప్పు చేస్తే భారీగా జరిమానా!

ఏపీలో పోలీసులు కొత్త చట్టాల ప్రకారం ట్రాఫిక్ నిబంధనల్ని అమలు చేస్తోంది. కొన్ని నిబంధనలు మారగా.. భారీగా జరిమానాలు విధిస్తా

తిరుపతి జిల్లావాసుల్ని పోలీసులు హెచ్చరించారు. నేటి నుంచి బైక్‌లు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ నిర్ణయం అమలుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు.. ఇప్పటికే ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించారు.. మిగిలిన ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే అన్నారు. మద్యం తాగి వాహనం నడిపితే రూ.10వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.. రెండోసారి దొరికితే జరిమానా పెరుగుతుంది, జైలు శిక్ష విధిస్తారు. ట్రాఫిక్‌‌లో రెడ్ లైట్ పడినా దాటుకుని వెళ్లిపోతే రూ.500 జరిమానా విధిస్తారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. 5 వేల ఫైన్ వేస్తారు. అతివేగంగా వాహనాలు నడిపితే రూ.వెయ్యికి జరిమానా విధిస్తారు.

ప్రమాదకరంగా వాహనాలు నడిపితే రూ.5వేల జరిమానా విధిస్తారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే రూ.1000 జరిమానా ఉంటుంది. బైక్‌లపై ట్రిపుల్ రైడింగ్, మొబైల్‌లో మాట్లాడుతూ వాహనాలు నడిపితే రూ.1200 జరిమానా విధిస్తారు. ఇన్స్యూరెన్స్ లేకుండా వాహనాలు నడిపితే వారికి రూ. 2వేల జరిమానా.. సీటు బెల్టు లేకుండా వాహనాలు నడిపితే రూ. 1000 జరిమానా ఉంటుంది. వాహనాలను అధిక లోడ్లతో నడిపితే రూ.20వేల జరిమానా, టన్నుకు రూ.2వేల జరిమానా విధిస్తారు. వాహనదారులు పదే, పదే నిబంధనలు ఉల్లంఘించినా సరే జైలు శిక్ష విధిస్తారు.

మరోవైపు తిరుపతిలో ఆటోమొబైల్‌ షాపులు, మెకానిక్‌లు హెల్మెట్లు విక్రయాలు మొదలు పెట్టారు. తిరుపతిలో డిమాండ్‌కు తగ్గట్టు కంపెనీ బ్రాండెడ్‌ హెల్మెట్లు లేవని చెబుతున్నారు వాహనదారులు. కొంతమంది బైక్ నడుపుతూ ఫోన్‌లో మాట్లాడతారు.. అలాంటి వాళ్లు కొత్త టెక్నాలజీతో వచ్చిన హెల్మెట్లపై జనాలు ఆసక్తి చూపుతున్నారు. హెల్మెట్‌లోనే బ్లూటూత్‌, లైటింగ్‌ సిస్టమ్ ఉంటోంది.. వీటి ధర కనీసం రూ.2500 వరకు ఉంటుందంటున్నారు. అది కూడా బ్రాండెడ్‌ కంపెనీల హెల్మెట్‌లకు డిమాండ్ పెరిగింది. షోరూముల్లో సాధారణ హెల్మెట్‌ రూ.1000 నుంచి రూ.1500 వరకు ఉంది. హెల్మెట్ల స్టాక్ అయిపోవడంతో మళ్లీ తెప్పిస్తున్నారు. మొత్తం మీద తిరుపతి మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. పోలీసులు ఇప్పటికే ప్రజలకు వివరించి వారికి అవగాహన కల్పించారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు