ఆల్‌టైమ్ రికార్డ్ సొంతం చేసుకున్న స్టాక్ మార్కెట్
మంగళవారం లాభాల్లో కొనసాగిన సూచీలు
23..560 మార్కును క్రాస్ చేసిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి తాజా రికార్డ్ సొంతం చేసుకున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ముగింపు వరకు అదే ఒరవడిని కొనసాగించాయి. ఇలా నిఫ్టీ అయితే ఆల్ రికార్డ్ సొంతం చేసుకుంది. 23, 560 మార్కును క్రాస్ చేసింది. అలాగే సెన్సెక్స్ కూడా హైలెవల్ కొనసాగింది. సెన్సె్క్స్ 308 పాయింట్లు లాభపడి 77, 301 దగ్గర ముగియగా.. నిఫ్టీ 92 పాయింట్లు లాభపడి 23, 557 దగ్గర ముగిసింది. సెన్సెక్స్ సూచీలో విప్రో, ఎం అండ్ ఎం, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టైటన్, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్ షేర్లు లాభాల్లో కొనసాగాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్, మజాగాన్ డాక్, కొచ్చిన్ షిప్‌యార్డ్, గార్డెన్ రీచ్ మరియు భారత్ ఎలక్ట్రికల్స్ అత్యంత యాక్టివ్ షేర్లలో ట్రేడ్ అయ్యాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.52 దగ్గర ప్రారంభమైంది.