ఉధృతంగా పారుతున్న జంపన్న వాగు

ఉధృతంగా పారుతున్న జంపన్న వాగు

ఎల్బక, పడిగాపూర్‌‌‌‌ గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జంపన్న వాగు ఉధృతంగా పారుతోంది. దీంతో ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్‌‌‌‌ గ్రామం చింతల్‌‌‌‌క్రాస్‌‌‌‌ నుంచి పడిగాపూర్‌‌‌‌, ఎల్బక గ్రామాలకు వెళ్లే రోడ్డులో జంపన్న వాగుపై ఉన్న వంతెన వరదతో మునిగిపోయింది. దీంతో ఆ రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు నిత్యావసరాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు మేడారం కొంగలమడుగు రహదారి వైపు నుంచి వేరే గ్రామానికి వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు.

సోమవారం ఉదయం నుంచి వర్షం పడుతున్నందున ఆ రోడ్డు కూడా బంద్‌‌‌‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసర్లు స్పందించి ఆదుకోవాలని రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మరో వైపు మేడారం సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తులు జంపన్న వాగులోకి దిగే అవకాశం ఉన్నందున ప్రమాదాలు జరగకుండా స్థానిక ఎస్సై శ్రీకాంత్‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలో వాగు పొడవునా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

తాడ్వాయి నుండి కాటాపూర్‌‌‌‌ గ్రామానికి వెళ్లే రహదారికి అడ్డంగా భారీ వృక్షం పడిపోవడంతో గంటసేపు రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న ఎస్సై సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని చెట్టును పక్కకు తొలగించారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు