తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూపు 4 ఉద్యోగాల ఎంపికకు షార్ట్‌లిస్ట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీరందరికీ ధ్రువీకరణ పత్రాల పరిశీలన జూన్ 20 నుంచి ఆగస్టు 21 వరకు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయం, పబ్లిక్ గార్డెన్స్‌లోని తెలుగు యూనివర్సిటీలలో గ్రూప్ 4కు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని తన ప్రకటనలో..
తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూపు 4 ఉద్యోగాల ఎంపికకు షార్ట్‌లిస్ట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీరందరికీ ధ్రువీకరణ పత్రాల పరిశీలన జూన్ 20 నుంచి ఆగస్టు 21 వరకు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయం, పబ్లిక్ గార్డెన్స్‌లోని తెలుగు యూనివర్సిటీలలో గ్రూప్ 4కు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని తన ప్రకటనలో కమిషన్ వెల్లడించింది. ఈ తేదీల్లో నిర్వహించే ధ్రువీకరణ పత్రాల పరిశీలకు ఎవరైనా గైర్హాజరైతే.. అటువంటి వారికి ఆగస్టు 24, 27, 28, 29, 31 తేదీల్లో పరిశీలిస్తామని కమిషన్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను కమిషన్ అధికారిక వెబ్సైట్లో పెట్టామని ఈ సందర్భంగా అభ్యర్ధులకు సూచించింది.
షార్ట్ లిస్టైన అభ్యర్ధుల వివరాలను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని దృవపత్రాల పరిశీలనకు తమతోపాటు తీసుకురావాలని కమిషన్ పేర్కొంది. అలాగే దీనితోపాటు 2 కాపీలు అప్లికేషన్ ఫాం, అటెస్టేషన్ కాపీలు రెండేసి చొప్పున డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. వీటితోపాటు క్యాస్ట్ సర్టిఫికెట్, బీసీ నాన్ క్రీమీలేయర్, వికలాంగ ధ్రువీకరణ సర్టిఫికెట్, ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ/నివాస ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 2021-22 ఏడాదికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్‌తోపాటు మిగతా అన్నీ అవసరమైన పత్రాలను తమ వద్ద తీసుకుని సర్టిఫికేషన్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని టీజీపీఎస్సీ పేర్కొంది. సంబంధిత అన్ని సర్టిఫికెట్లను పరిశీలన సమయంలో తప్పనిసరి సమర్పించాలని, అదనంగా ఎవరికీ గడువు ఇచ్చేది లేదని ఇప్పటికే కమిషన్ స్పస్టం చేసింది.
కాగా మొత్తం మొత్తం 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుంది. గ్రూప్ 4 ఫలితాలను ఈ ఏడాది ఫిబ్రవరి 9న ప్రకటించిన టీఎస్పీఎస్సీ.. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 1 : 3 నిష్పత్తిలో మెరిట్ జాబితాను విడుదల చేసింది. దివ్యాంగ కేటగిరీలో 1 : 5 నిష్పత్తిలో మెరిట్ జాబితాను విడుదల చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం తుది ఫలితాలను త్వరలోనే వెల్లడికానున్నాయి.