నేటి నుంచి TGPSC గ్రూప్‌ 4 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌.. ఈ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి

నేటి నుంచి TGPSC గ్రూప్‌ 4 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌.. ఈ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి

తెలంగాణ రాష్ట్రంలో 8,180 గ్రూప్‌ 4 సర్వీసుల పోస్టుల కోసం 1:3 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసిని సంగతి తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులందరికీ జూన్‌ 20 అంటే ఈ రోజు నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ దాదాపు రెండు నెలల పాటు కొనసాగుతుంది. ఆగస్టు 21తో ధ్రువీకరణ పత్రాల పరిశీలన ముగుస్తుంది. నాంపల్లి టీజీపీఎస్సీ కార్యాలయం, పబ్లిక్‌గార్డెన్‌లోని..

తెలంగాణ రాష్ట్రంలో 8,180 గ్రూప్‌ 4 సర్వీసుల పోస్టుల కోసం 1:3 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసిని సంగతి తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులందరికీ జూన్‌ 20 అంటే ఈ రోజు నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ దాదాపు రెండు నెలల పాటు కొనసాగుతుంది. ఆగస్టు 21తో ధ్రువీకరణ పత్రాల పరిశీలన ముగుస్తుంది. నాంపల్లి టీజీపీఎస్సీ కార్యాలయం, పబ్లిక్‌గార్డెన్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీల్లో ప్రతిరోజూ ఉదయం, మధాహ్నం వేళల్లో పరిశీలన జరుగుతుంది. ఏదైనా కారణం వల్ల గైర్హాజరైన వారు, ఏదైనా ధ్రువీకరణ పత్రం ఇవ్వనివారు.. ఉంటే అటువంటి వారి కోసం ఆగస్టు 24, 27, 31 తేదీలను రిజర్వుడేగా టీజీపీఎస్సీ ప్రకటించించింది. ఆగస్టు 31వ తేదీ సాయంత్రం 5గంటల తర్వాత వెరిఫికేషన్‌కు అనుమతించబోమని టీజీపీఎస్సీ కార్యదర్శి డా.నవీన్‌ నికోలస్‌ స్పష్టం చేశారు.

టీజీపీఎస్సీ గ్రూప్‌ 4 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఈ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి..
ప్రాథమిక వివరాలు నింపిన చెక్‌లిస్ట్‌
దరఖాస్తు ఫారం 2 కాపీలు
పరీక్ష హాల్‌టికెట్‌
బర్త్ సర్టిఫికెట్‌ లేదంటే ఎస్‌ఎస్‌సీ మెమో
ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ/నివాస సర్టిఫికెట్‌
విద్యార్హతలకు సంబంధించిన ప్రొవిజినల్‌, కాన్వొకేషన్‌ సర్టిఫికెట్‌, మార్కుల మెమో (గ్రాడ్యుయేషన్‌/పీజీ)
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన తండ్రి లేదా తల్లి పేరుతో మాత్రమే ఉన్న కుల ధ్రువీకరణ పత్రం
బీసీ నాన్‌ క్రిమీలేయర్‌ సర్టిఫికెట్‌ (ఓబీసీ సర్టిఫికెట్‌లను అనుమతించరు)
వివాహిత మహిళలకు ఇంటిగ్రేటెడ్‌ కమ్యూనిటీ సర్టిఫికెట్‌, నాన్‌ క్రిమీలేయర్‌ సర్టిఫికెట్లు భర్త పేరుతో ఉంటే అనుమతి లేదు.
2021-22 ఏడాదితో ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణ పత్రం
దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్‌
ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు సంబంధిత సంస్థ నుంచి తీసుకున్న ఎన్‌వోసీ సర్టిఫికెట్‌
గెజిటెడ్‌ అధికారి సంతకంతో 2 అటిస్టేషన్‌ కాపీలు
నిరుద్యోగి అని పేర్కొనే డిక్లరేషన్
పోస్ట్‌ కోడ్‌ 70కి అప్లై చేసిన అభ్యర్థులు తాము హిందువు అని తెలిపే డిక్లరేషన్‌ సర్టిఫికెట్‌
పోస్ట్‌కోడ్‌ 94, 95కు సంబంధించిన ఉద్యోగాలకైతే సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ ర్యాంక్‌కు తక్కువ కాని అధికారి నుంచి ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌
తెచ్చుకోవాలి
మూడు లేటెస్ట్ పాస్‌పోర్టు సైజు ఫొటోలు

Please follow and like us:
తెలంగాణ వార్తలు