యాదాద్రి నరసింహ స్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ప్రారంభం.. బ్రహ్మోత్సవాలకు పూర్తి చేయాలనే లక్ష్యం..

యాదాద్రి నరసింహ స్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ప్రారంభం.. బ్రహ్మోత్సవాలకు పూర్తి చేయాలనే లక్ష్యం..

తెలంగాణాలో ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట. ఇక్కడ కొలువైన శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని దేదీప్యమానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను పూజారులు శాస్త్రోక్తంగా పూజలను నిర్వహించి ప్రారంభించారు.

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. దివ్య విమాన గోపురానికి కళవరోహణ పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు దివ్య విమాన గోపుర సుదర్శన చక్రానికి నవ కలశ స్నాపనం, దేవత అవనం పూజలు చేశారు ఆలయ అర్చకులు. దీంతో పనుల్లో వేగం పుంజుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సౌకర్యాలు మెరుగుపడ్డాయని చెప్పిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ముగిసేలోగా గోపురంకి బంగారు తాపడం పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు.

బంగారు తాపడం పనుల బాధ్యతలను స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ పనులు స్వామి బ్రహ్మోత్సవాల నాటికి ముందే 2025 మార్చిలోగా పూర్తి చేయాలని సూచించింది. పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు దేవాదాయ శాఖ నుంచి పలువురు సభ్యులుగా ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బంగారు తాపడం పనులను పర్యవేక్షిస్తూ సూచనలు, సలహాలిస్తున్నారు. ఇందులో భాగంగా బంగారు తాపడం పనులు వేగవంతం చేశారు ఆలయ అధికారులు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు