తెలంగాణ ఎక్సైజ్‌శాఖలో 116 సూపర్‌ న్యూమరరీ కానిస్టేబుళ్ల పోస్టులు

తెలంగాణ ఎక్సైజ్‌శాఖలో 116 సూపర్‌ న్యూమరరీ కానిస్టేబుళ్ల పోస్టులు

తెలంగాణ ఎక్సైజ్‌శాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అకాడమీలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్ల పోస్టులకు సంబంధించి మొత్తం 116 సూపర్‌ న్యూమరరీ పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ ఎక్సైజ్‌ అకాడమీలో ఆరు నెలల శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లను ఈ పోస్టుల్లో నియమించే అవకాశం ఉంది. కాగా రాష్ట్రంలో 2022 రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఎక్సైజ్‌శాఖలో..

తెలంగాణ ఎక్సైజ్‌శాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అకాడమీలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్ల పోస్టులకు సంబంధించి మొత్తం 116 సూపర్‌ న్యూమరరీ పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ ఎక్సైజ్‌ అకాడమీలో ఆరు నెలల శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లను ఈ పోస్టుల్లో నియమించే అవకాశం ఉంది. కాగా రాష్ట్రంలో 2022 రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఎక్సైజ్‌శాఖలో 614 కానిస్టేబుళ్ల పోస్టులకు నియామకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అంతకన్నా ముందు ఏడాదే ఎక్సైజ్‌శాఖలో జరిగిన పునర్విభజన ప్రకారం కొత్తగా 14 ఠాణాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయ్యింది.

వీటిల్లో పనిచేసేందుకు వీలుగా 614 పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టారు. అయితే ఇప్పటివరకు కొత్తగా ప్రకటించిన ఎక్సైజ్‌ ఠాణాలు ఏర్పాటు కాకపోవడంతో 614 పోస్టుల్లో 116 పోస్టులు ప్రస్తుతం అందుబాటులో లేకుండాపోయాయి. కంటీజియస్‌ డిస్ట్రిక్ట్‌-4లో 6 పోస్టులు, కంటీజియస్‌ డిస్ట్రిక్ట్‌-5లో 6 పోస్టులు, కంటీజియస్‌ డిస్ట్రిక్ట్‌-6లో 104 పోస్టులు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలోనే ఈ పోస్టులను భర్తీ చేసేందుకు సూపర్‌న్యూమరరీ పోస్టుల్ని సృష్టించారు. అకాడమీలో ఉన్న కానిస్టేబుళ్ల శిక్షణ ప్రక్రియ పూర్తికాగానే ఈ పోస్టుల్లో వారిని పున రద్దవుతాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

Please follow and like us:
తెలంగాణ వార్తలు