తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుతం తీవ్ర డైలమాలో ఉన్నారు. ప్రభుత్వం రెండో విడత కార్పొరేషన్ పదవుల జాతరకు సిద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్ నేతలు కార్పొరేషన్ పదవులకో, లేక పార్టీకి సంబంధించిన పదవులకో ప్రయత్నం చేయాలా అనే తర్జన భర్జనలో ఉన్నారు. ఇటీవల పీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం జరుగడంతో పార్టీలో కూడా పదవుల కోసం పోటీపడే స్థితి ఏర్పడింది. ఈ పరిణామాలు చాలా మంది నేతలను గందరగోళంలోకి నెడుతున్నాయి. తమ భవిష్యత్ కోసం ఎలాంటి […] నిర్ణయం తీసుకోవాలో స్పష్టత రాని స్థితిలో ఉన్నారు.
ఇంకా 40 కి పైగా కార్పొరేషన్ పదవులు ఖాళీగా ఉండటంతో, వాటిపై కన్నేసిన నాయకులు, అవి కేవలం రెండు సంవత్సరాల కాలపరిమితితో ఉంటాయనే ఆలోచనలో ఉన్నారు. ఈ పదవులు తీసుకున్న తరువాత భవిష్యత్‌లో ఏమిటనే సందేహం వారిని వేధిస్తోంది. చాలా మంది నేతలు ఇప్పుడు పార్టీ పదవులు తీసుకొని, తరువాతి దశలో కార్పొరేషన్ పదవులు పొందాలన్న యోచనలో ఉన్నారు. పార్టీలో పదవులు దక్కుతాయో లేదో అనే సందేహం ఒకవైపు, కార్పొరేషన్ పదవుల కోసం ప్రయత్నించాలని అనుకుంటే రాజకీయ భవిష్యత్తు ఏమిటో అనే చింత మరొకవైపు. మొత్తంగా కాంగ్రెస్ నేతల్లో నిశ్చయ నిర్ణయలేని పరిస్థితి కొనసాగుతుండగా, ప్రభుత్వ, పార్టీ పదవుల కోసం పోటీయే గందరగోళం మరింతగా ముదిరే అవకాశముంది.