టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు అదిరే న్యూస్.. త్వరలోనే కీలక ప్రకటన, అంతా సెట్!

టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు అదిరే న్యూస్.. త్వరలోనే కీలక ప్రకటన, అంతా సెట్!

ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలకు సంబంధించి నేతలు, కార్యక్రర్తలకు ముఖ్యమైన గమనిక. నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి కసరత్తు జరుగుతోంది.. టీడీపీ, జనసేన, బీజేపీలు ఓ ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. ఈ

ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీపై ఫోకస్
మూడు పార్టీల మధ్య డీల్ కూడా ఓకే చేశారట
ఈ పదువుల్ని ఎలా భర్తీ చేయాలో నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతలు, కార్యకర్తలు ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ పడబోతుందా?.. త్వరలోనే శుభవార్త వినబోతున్నారా?.. అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసే, బీజేపీలు నామినేటెడ్ పోస్టుల భర్తీపై కసరత్తు చేస్తోంది.. ఈ మేరకు పదవుల పంపకాలపై ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. మూడు పార్టీలు నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేయడంపై ఓ ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు మూడు పార్టీలు త్వరలోనే ఈ పదవుల పంపకాలను చేపట్టే అవకాశం ఉంది అంటున్నారు.

మూడు పార్టీల మధ్య కుదిరిన డీల్ ప్రకారం.. టీడీపీ ఎమ్మెల్యేలున్న చోట 60 శాతం నామినేటెడ్‌ పోస్టులు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకే దక్కుతాయి. మిగిలిన వాటిలో.. 30 శాతం జనసేన శ్రేణులకు, మిగతా పదవులు బీజేపీకి ఇస్తారు. జనసేన ఎమ్మెల్యేలున్న చోట 60 శాతం పోస్టులు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఇస్తారు. 30 శాతం పోస్టులు టీడీపీకి, 10శాతం బీజేపీకి కేటాయిస్తారు. బీజేపీ ఎమ్మెల్యేలున్న చోట ఆ పార్టీకి 50 శాతం పదవులు, మిగిలిన 50 శాతం టీడీపీ, జనసేనలకు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు బుధవారం సాయంత్రం పార్టీ నాయకులు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారట. ఈ కాన్ఫరెన్స్‌లో నామినేటెడ్‌ పోస్టుల సర్దుబాటుపై స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. పదేళ్లుగా పార్టీ కోసం పని చేసిన నేతలు, కార్యకర్తల్ని గుర్తు పెట్టుకుంటామన్నారు నాగబాబు. ఎమ్మెల్యేలంతా కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వాలని, పదవుల భర్తీలో వారికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. నియోజకవర్గాల్లో పనిచేసిన నేతలు, కార్యకర్తలను గుర్తించి, వారి వివరాలు పంపించాలని ఆయన కోరారు.

జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఉన్న వైఎస్సార్‌సీపీ నేతల్ని చేర్చుకునేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. అయితే టీడీపీ, జనసేన పార్టీ నేతలపై కేసులు పెట్టని వారిని.. వారిని ఇబ్బందులకు గురి చేయని వారిని గుర్తించి, పూర్తి స్థాయిలో ఆరా తీసిన తర్వాతే జనసేన పార్టీలో చేర్చుకోవాలని సూచించారట. పదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించడంతో పాటు కేసులు నమోదైన వారి వివరాలు పంపించామని చెప్పారట.

నామినేటెడ్ పదవుల భర్తీ విషయానికి సవ్తే.. ఎమ్మెల్యే టికెట్లు ఆశించి దక్కినటీడీపీ, జనసేన నేతలు చాలామంది ఉన్నారు.వీరిలో పలువురు ముఖ్యమైన నామినేటెడ్ పోస్టుల కోసం పోటీపడుతున్నారు. అటు నియోజకవర్గాల స్థాయిలోని నామినేటెడ్‌ పదవులపైనా చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఈ పదవుల భర్తీపై మూడు పార్టీల మధ్య కీలక ఒప్పందం కుదరడంతో.. త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు