అయితే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ సంఘటన గురించి తెలిస్తే. ఇలాంటి సేవలను ఉపయోగించుకోవాలంటే భయపడడం ఖాయం. ఇంతకీ ఏం జరిగిందంటే.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ద్వారా తన ల్యాప్‌టాప్‌ను మరో చోటుకు పంపించాడు. దీంతో ఆ డెలివరీ బాయ్ చెప్పిన ప్రదేశంలో ల్యాప్‌ట్యాప్‌ను…
కాలం మారిపోయింది. మారుతోన్న టెక్నాలజీతో పాటు పనులు కూడా చాలా సులభంగా మారిపోయాయి. ఫుడ్ డెలివరీ యాప్‌లు అందుబాటులోకి రావడంతో నేరుగా ఇంటికే ఫుడ్ వచ్చే రోజులు వచ్చేశాయ్. అయితే డెలివరీ సర్వీసులు కేవలం ఫుడ్ మాత్రమే కాకుండా ఇతర వస్తువులను సైతం డెలివరీ చేస్తున్నాయి. పలానా చోటు నుంచి ఒక వస్తువు తీసుకెళ్లి మరో చోట ఇచ్చే సేవలకు ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. చాలా మంది ఈ సేవలను వినియోగించుకుంటున్నారు.
అయితే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ సంఘటన గురించి తెలిస్తే. ఇలాంటి సేవలను ఉపయోగించుకోవాలంటే భయపడడం ఖాయం. ఇంతకీ ఏం జరిగిందంటే.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ద్వారా తన ల్యాప్‌టాప్‌ను మరో చోటుకు పంపించాడు. దీంతో ఆ డెలివరీ బాయ్ చెప్పిన ప్రదేశంలో ల్యాప్‌ట్యాప్‌ను డెలివరీ చేయకుండా.. దొంగలించి, తిరిగి చెల్లించాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని సదరు వ్యక్తి భార్య సివిల్ ఇంజనీర్ అయిన నిషిత గుడిపూడి లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ అంశం వైరల్‌గా మారింది.
ఆమె చేసిన పోస్ట్ ప్రకారం.. తన భర్త హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని ఒక ఆఫీసు నుంచి మరో ఆఫీస్‌కి బ్యాక్‌ప్యాక్‌లో ల్యాప్‌టాప్‌ను డెలివరీ చేయడానికి స్విగ్గీ అందించే ప్యాకేజీ డెలివరీ సర్వీస్ అయిన Swiggy Genie సర్వీస్‌ను బుక్ చేసుకున్నాడు. డెలివరీ పార్టనర్, వచ్చి బ్యాగ్‌ని తీసుకున్నాడు. అయితే కాసేపటి తర్వాత ఫోన్ స్విఛ్ ఆఫ్ చేశాడు. ఎంతకీ ల్యాప్‌టాప్ డెలివరీ కాకపోవడంతో అనుమానం వచ్చిన అతను స్విగ్గీ కస్టమర్ కేర్‌కు కాల్ చేశాడు. అయితే స్విగ్గీ వాళ్లు కూడా అతన్ని గుర్తించలేకపోయారు.
అనంతరం కాసేపటి తర్వాత సదరు డెలివరీ బాయ్ వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు. ల్యాప్‌టాప్ కావాలంటే రూ. 15000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు పంపించిన వెంటనే ర్యాపిడో ద్వారా ల్యాప్‌టాప్‌ను తిరిగి ఇస్తానని బేరానికి దిగాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురైన ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ సంఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇంటి ముందుకు నవ్వుతూ వచ్చే డెలివరీ బాయ్స్‌లో ఇలాంటి కోణం కూడా ఉంటుందా అని ప్రజలు షాక్ అవుతున్నారు.