మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా. మొదటి రోజే భారీగా వసూల్ చేసింది ఈ సినిమా.. కేవలం 5 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 555 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య పోరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించాడు.
ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీసినిమా జూన్ 27న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా. మొదటి రోజే భారీగా వసూల్ చేసింది ఈ సినిమా.. కేవలం 5 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 555 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య పోరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించాడు. అలాగే కల్కి సినిమాలో విలన్ గా నటించిన కమల్ హాసన్ కూడా చాలా డేంజరస్ స్టైల్ లో కనిపిస్తున్నాడు.
ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయి మరింత పెరిగింది. పాన్ ఇండియా మూవీ కల్కికి సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోనూ క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రాంతీయ భాషతో పాటు హిందీ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ‘కల్కి 2898 AD’ విడుదలై 6 రోజులు అయ్యింది. ఆరురోజులకు ఈ మూవీ రూ.625 కోట్లు రాబట్టింది. ప్రభాస్ చిత్రం మొదటి రోజు భారతదేశంలో 95.3 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. అయితే ఈ సినిమా హిందీలో తొలిరోజు 22.5 కోట్లు రాబట్టింది. రెండో రోజు కూడా భారీగానే రాబట్టింది. . అలాగే మూడో రోజు ఈ వసూళ్లు రూ.26 కోట్లకు చేరాయి.