ఏపీలో ఆగస్టు 1న పింఛన్ల పంపిణీ.. నాలుగు రోజులు ముందే, అధికారుల కీలక ప్రకటన

ఏపీలో ఆగస్టు 1న పింఛన్ల పంపిణీ.. నాలుగు రోజులు ముందే, అధికారుల కీలక ప్రకటన

ఏపీలో ఆగస్టు 1న పింఛనల్ పంపిణీ చేయనున్నారు.. అయితే సెర్ప్ సీఈవో కీలక ఆదేశాలు జారీ చేశారు. పింఛన్ల పంపిణీకి సంబంధిం….

ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు నెల పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. నాలుగు రోజులు ముందుగానే నిధుల విడుదలపై ఫోకస్ పెట్టింది. గత నెలలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు పింఛన్ల పంపిణీ బాధ్యత అప్పగించగా.. ఈసారి కూడా వారే ఆగస్టు ఒకటో తేదీన ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అలా చేయని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టంగా తెలియజేశారు. అస్వస్థతతో ఉన్న వారు, ఇంకా పంపిణీ మిగిలితే 2న ఇస్తారు. ఎవరైనా పింఛన్ లబ్ధిదారులు ఇతర ప్రాంతాల్లో ఉంటే ఆగస్టు ఒకటినాటికి స్వగ్రామాల్లో అందుబాటులో ఉండేలా సమాచారం ఇవ్వాలని అధికారులు సచివాలయ ఉద్యోగులకు సూచించారు

మరవైపు ఆగస్టు నెలలో పింఛన్ల పంపిణీకి సంబంధించి సెర్ప్ సీఈవో కొన్ని సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు.. ఆగస్టు 1న ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీని ప్రారంభించాలన్నారు. మొదటి రోజే 99శాతం పింఛన్లు పంపిణీ పూర్తి కావాలని.. ఒకవేళ సాంకేతిక సమస్య ఎదురైతే రెండోరోజు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు.. ఆ తర్వాత పంపిణీ సమయం పొడిగించరని తెలిపారు. అలాగే మొదటి రెండు రోజులు పింఛన్ పంపిణీపై అన్ని గ్రామాల్లో సోషల్ మీడియా, మీడియా, బీట్ ఆఫ్ టామ్ టామ్, బహిరంగ ప్రదేశాల్లో ఆడియో రికార్డిగ్ ప్లే చేయడం, వాట్సాప్ ద్వారా విస్తృత ప్రచారం చేయాలని.. ఈ సమాచారం ప్రతి పింఛన్ లబ్ధిదారుడికి చేరాలని సూచించారు.

ఒకవేళ 90 కంటే ఎక్కువ మంది పింఛనుదారులు ఒకే సిబ్బందికి మ్యాప్‌ చేయబడిన చోట, అటువంటి మ్యాపింగ్‌ మొత్తం (91 నుంచి 100 పింఛనుదారులు: 86 మంది సిబ్బంది & 100 కంటే ఎక్కువ మంది పెన్షనర్లు: 12 మంది సిబ్బంది) తగ్గించాలని సూచించారు. ఈ రీ మ్యాపింగ్‌ ప్రక్రియ శనివారం (27-07-2024) నాటికి పూర్తి చేయాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా పింఛన్ డబ్బుల్ని ఇప్పటికే అన్ని ఎంపీడీవోలు, కమీషనర్‌లకు పంపించామన్నారు. ఈ మొత్తాలు 31.07.2024న సచివాయాల‌ బ్యాంక్‌ ఖాతాలకు జమ చేయబడతాయన్నారు. అన్ని PS/WASలకు వారి బ్యాంక్‌ మేనేజర్‌లకు నగదు ఆవశ్యక లేఖను ముందుగానే అందించమని తెలియజేయాలన్నారు. ఈ నెల 31న నగదు మొత్తాన్ని విత్‌డ్రా చేయాలని సూచించారు.

ఆగస్టు 2వ తేదీన చెల్లింపు పూర్తయిన తర్వాత, చెల్లించని మొత్తాన్ని రెండు రోజుల్లోపు SERPకి తిరిగి చెల్లించాలని సూచించారు. చెల్లించని పింఛన్లన్నింటికీ చెల్లించని కారణాలు సంక్షేమ సహాయకులు 5వ తేదీన, అంతకు ముందు ఆన్లైన్‌‌లో తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. ఎంపీడీవోలు, కమీషనర్లు సచివాలయాలలో ప్రతి గంట ప్రాతిపదికన పంపిణి పర్యవేక్షించాలని, మొదటి రోజు పంపీణీ పూర్తి చేసేలా చూసుకోవాలని సూచించారు.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు