విద్యార్థులకు సెలవులు వచ్చాయంటే చాలు ఎగిరిగంతేస్తుంటారు. సెలవు రోజుల్లో తెగ ఎంజాయ్ చేస్తుంటారు. సాధారణంగా పాఠశాలలకు రెండో, శనివారం, ఆదివారం వస్తుంటాయి. అలాగే పండగలు ఉంటే ఇంకా ఎక్కువ రోజుల పాటు సెలవులు వస్తుంటాయి. అలాంటి సమయంలో విద్యార్థులకు పండగనే అని చెప్పాలి. ఎందుకంటే ఈ సెప్టెంబర్‌లో వినాయక చవితి, నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఇ మిలాద్ (ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజు) వస్తుండటం, అలాగే శని, ఆదివారాలు కలిసి రావడంతో వరుస సెలవులు వస్తున్నాయి.
ఈ సెప్టెంబర్ నెలలోనే అనగానే అందరికీ ఇష్టమైన గణేష్ చతుర్థి పండగ. ఈ పండగ కోసం చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే నిమజ్జనం రోజు కూడా అంతకంటే రెట్టింపు ఎంజాయ్ ఉంటుంది. ఈ సెప్టెంబర్ నెలలో వినాయక చవితి పండగ 7వ తేదీ శనివారం రోజున జరుపుకోనున్నారు. అలాగే మరుసటి రోజు ఆదివారం (సెప్టెంబర్ 8) కావడంతో వరుసగా రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు రానున్నాయి.
వరుసగా మూడు రోజులు సెలవులు!
అంతేకాకుండా ఈ సెప్టెంబర్ నెలలో వరుసగా మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 14వ తేదీ రెండో శనివారం. దీని కారణంగా పాఠశాలలకు సెలవు. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 15వ తేదీన ఆదివారం పాఠశాలలకు సాధారణ సెలవే. ఇక 16వ తేదీన సోమవారం రోజున మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఇ మిలాద్ సందర్భంగా పాఠశాలలకు సెలవు ఉంటుంది. ఇలా చూస్తే వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి.