మయోసైటిస్ అనే కండరాల సంబంధిత వ్యాధి బారిన పడిన ఆమె ఇప్పుడే కోలుకుంటోంది. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్తుందంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో సామ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ఇవన్నీ వట్టి వదంతులు మాత్రమేనని ఆమె వ్యక్తిగత టీమ్ కొట్టిపారేసింది.
సమంత దక్షిణ కొరియాకు వెళ్లడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎలాంటి సమాచారం లేకుండా ఒకరి ఆరోగ్యం గురించి ఇలా ఏది పడితే అది ఎలా రాస్తారని సామ్ టీమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె అనారోగ్యం నుంచి కోలుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోందని స్పష్టం చేసింది. అనవసరంగా తన ఆరోగ్యం గురించి వదంతులు సృష్టించవద్దని కోరింది.
Please follow and like us: