రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..! రుణమాఫీపై త్వరలోనే రైతులకు శుభవార్త..

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..! రుణమాఫీపై త్వరలోనే రైతులకు శుభవార్త..

ఆగస్ట్‌ 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం.. ఏక కాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతాం.. లక్షలాది మంది రైతులకు కచ్చితంగా రుణమాఫీ చేస్తాం.. అంటూ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన విషయం తెలిసిందే.. ఇదే విషయం లోక్ సభ ఎన్నికల సమయంలో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.. సవాళ్లు.. ప్రతిసవాళ్లతో పొలిటికల్ తారస్థాయికి చేరుకుంది..

ఆగస్ట్‌ 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం.. ఏక కాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతాం.. లక్షలాది మంది రైతులకు కచ్చితంగా రుణమాఫీ చేస్తాం.. అంటూ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన విషయం తెలిసిందే.. ఇదే విషయం లోక్ సభ ఎన్నికల సమయంలో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.. సవాళ్లు.. ప్రతిసవాళ్లతో పొలిటికల్ తారస్థాయికి చేరుకుంది.. అయితే.. గతంలో ఇచ్చిన మాటను.. హామీని పక్కగా.. ఆగస్టు 15లోపు నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి స్పీడును పెంచారు. రైతు రుణమాఫీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే.. అధ్యయనాలు.. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన రేవంత్ రెడ్డి.. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపే రూ.2 లక్షల మేర రుణమాఫీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే రైతులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి..

రైతుల రుణమాఫీకి సంబంధించిన గైడ్‌లైన్స్ ఖరారు చేసేందుకు రేవంత్ రెడ్డి త్వరలోనే కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.. కటాఫ్ తేదీ, అర్హుల గుర్తింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నారని అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటికే రోజూ పదుల సంఖ్యలో రైతులు, రైతుసంఘాల నేతలతో సీఎం రేవంత్ ఫోన్‌లో మాట్లాడుతున్నారు. సంపన్నులకు రైతుబంధు, రుణమాఫీ ఇవ్వొద్దని రైతుల నుంచి సూచనలు అందినట్లు తెలుస్తోంది.. ప్రభుత్వ పథకాల్లో సీలింగ్ తప్పని సరిగా ఉండాలని ప్రభుత్వానికి వినతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అర్హులైన రైతులకే సహాయం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అంతేకాకుండా.. ఇతర రాష్ట్రాల్లో రైతులకు ఇస్తున్న పథకాలపై అధ్యయనం చేయాలని రేవంత్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో అధ్యయన బృందం ఇప్పటికే పర్యటించింది.

వాటిని పరిశీలించిన తర్వాత.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని త్వరలోనే రుణమాఫీ విధివిధానాలు ప్రకటించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది..

Please follow and like us:
తెలంగాణ వార్తలు