జూన్ 19 నుంచి సూపర్ 8 మ్యాచ్‌లు
అభిమానులకు బ్యాడ్ న్యూస్
సూపర్ 8 మ్యాచ్‌లు కష్టమే
టీ20 ప్రపంచకప్ 2024లో ‘సూపర్ 8’ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. బుధవారం (జూన్ 19) నుంచి మెగా టోర్నీ సూపర్ 8 మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. ఈ మ్యాచ్‌లకు వెస్టిండీస్‌లోని బార్బోడస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, ఆంటిగ్వా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే సూపర్ 8 మ్యాచ్‌లకు ముందు అక్కడి వాతావరణ శాఖ ఓ బ్యాడ్ న్యూస్ తెలిపింది. సూపర్ 8 మ్యాచ్‌లు అన్నింటికీ వర్షం ముప్పు పొంచి ఉందని పేర్కొంది.
జూన్ 20న జరిగే భారత్, అఫ్గానిస్థాన్ మ్యాచ్ మినహా అన్ని సూపర్ 8 మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించనుందని వాతావరణ శాఖ తెలిపింది. బార్బోడోస్ వేదికగా జరిగే భారత్, అఫ్గానిస్థాన్ మ్యాచ్ సమయంలో 10 నుంచి 15 శాతం వర్షం పడనుందట. బార్బోడోస్ స్టేడియంలో జరిగే ఇతర మ్యాచ్‌ల సమయంలో 40 నుంచి 55 శాతం వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. సెయింట్ లూసియాలో జరిగే మ్యాచ్‌లకు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది.
సెయింట్ విన్సెంట్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ల సమయంలో 52 శాతం వర్షం పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంటిగ్వా వేదికగా జరిగే భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ సమయంలో 20 శాతం వర్షం కురిసే అవకాశం ఉందట. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్ 8లో జరిగే దాదాపు 80 శాతం మ్యాచ్‌లపై వర్షం ప్రభావం చూపనుందట. ఈ విషయం తెలిసిన ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గ్రూప్ దశలో కొన్ని మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.