ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగాల 24 గంటలలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అదే సమయంలో మరికొన్ని జిలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ చత్తీస్గడ్ పరిసర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం.. సగటు సముద్ర మట్టానికి 5.8 కి. మీ. ఎత్తు వరకు విస్తరించిందని.. ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉన్న ఆవర్తనం చెందుతుందని చెప్పారు. దీంతో సముద్ర మట్టానికి 1.5 కి. మీ ఎత్తులో అల్పపీడనం కొనసాగుతోందని ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. కొన్ని ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది కూడా.. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగాల 24 గంటలలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అదే సమయంలో మరికొన్ని జిలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ చత్తీస్గడ్ పరిసర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం.. సగటు సముద్ర మట్టానికి 5.8 కి. మీ. ఎత్తు వరకు విస్తరించిందని.. ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉన్న ఆవర్తనం చెందుతుందని చెప్పారు. దీంతో సముద్ర మట్టానికి 1.5 కి. మీ ఎత్తులో అల్పపీడనం కొనసాగుతోందని ప్రకటించింది. అంతేకాదు ఈ నెల 19 న పశ్చిమ -మధ్య వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ సిబ్బంది తెలిపింది. దీంతో గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో ఈదురు వీచే ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
తెలంగాణలో ఏఏ జిల్లాల్లో వర్షాలు అంటే
ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కొమరం భీమ్, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హనుమకొండ, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
హైదరాబాద్ లో ఎలా ఉండనున్నదంటే
ఈ అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వెల్లడించారు. అంతేకాదు నగరంలోని పలు ప్రాంతాలలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో నగరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ లో ఎలా వాతావరణం ఉండనున్నదంటే
ఈ నెల 19వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతవరణ శాఖ వెల్లడించింది. దీంతో ఈ రోజు కోస్తాలో తేలిక నుంచి మోస్తారు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈరోజు శ్రీకాకుళం, పార్వతీపురం ,అల్లూరి జిల్లా, పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అంతేకాదు రాయలసీమ జిల్లలో కూడా పిడుగులతో కూడిన తెలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు సముద్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కనుక వేటకు వెళ్ళే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని.. అసలు సముద్రం మీద వేటకు వెళ్ళవద్దు అంటూ సూచించింది.