2019లో క్లిక్ చేసిన ప్రధాని మోడీ సెల్ఫీ. ఆ ఫోటోలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 13 మంది బాలీవుడ్ తారలు కనిపించారు. అందరూ ప్రధానిని కలిశారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ ప్రధానితో ఉన్న సందర్భాన్ని జ్ఞాపకంగా పదిల పరచుకుంటూ చిత్రాలను క్లిక్ చేసి వాటిని తమ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేసుకున్నారు. అయితే ఈ చిత్రం సోషల్ మీడియాలో చర్చకు వచ్చినంతగా.. ప్రధాని మోడీతో ఉన్న సినిమా తారల చిత్రం ఏదీ నెట్టింట్లో చర్చకు రాలేదు.
నేడు ప్రధాని మోడీ బర్త్ డే.. మళ్ళీ వైరల్ అవుతోన్న 13 మంది బాలీవుడ్ తారలతో దిగిన సెల్ఫీ ఫోటో..
జ్ఞాపకాలను భద్రపరచుకోవడానికి ఫోటోలు మంచి మార్గమని చెబుతారు. పాత ఫోటోలు చూస్తే చాలా పాత జ్ఞాపకాలు మదిలో మెదులుతూ తాజా పరిమళాన్ని పంచుతాయి. ఈరోజు మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు. గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు నరేంద్ర మోడీ. ఈ రోజుతో మోడీ 74 ఏట అడుగు పెట్టారు. ఈ సందర్భంగా కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన ప్రధాని మోడీ చిత్రం గురించి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం..
2019లో క్లిక్ చేసిన ప్రధాని మోడీ సెల్ఫీ. ఆ ఫోటోలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 13 మంది బాలీవుడ్ తారలు కనిపించారు. అందరూ ప్రధానిని కలిశారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ ప్రధానితో ఉన్న సందర్భాన్ని జ్ఞాపకంగా పదిల పరచుకుంటూ చిత్రాలను క్లిక్ చేసి వాటిని తమ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేసుకున్నారు. అయితే ఈ చిత్రం సోషల్ మీడియాలో చర్చకు వచ్చినంతగా.. ప్రధాని మోడీతో ఉన్న సినిమా తారల చిత్రం ఏదీ నెట్టింట్లో చర్చకు రాలేదు.
ప్రధాని మోడీతో పాటు 13 మంది బాలీవుడ్ తారలు
రణవీర్ సింగ్ నవ్వుతూ సెల్ఫీని క్లిక్ మనిపించాడు. ప్రధాని మోడీని కలిసిన తర్వాత నతీనటు అంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఆయుష్మాన్ ఖురానా, వరుణ్ ధావన్, ఏక్తా కపూర్, భూమి పెడ్నేకర్, అలియా భట్, చిత్రనిర్మాత అశ్వినీ అయ్యర్, రాజ్‌కుమార్ రావ్, రోహిత్ శెట్టి, విక్కీ కౌశల్, రణబీర్ కపూర్, కరణ్ జోహార్ , సిద్ధార్థ్ మల్హోత్రా ఈ చిత్రంలో కనిపిస్తున్నారు. వీరందరి మధ్యలో ప్రధాని మోడీ నవ్వుతూ కనిపిస్తున్నారు.
ఈ విషయాన్ని ప్రధాని మోదీ తెలిపారు
ఈ చిత్రాన్ని ప్రధాని మోడీ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఫోటోను పంచుకుంటూ, “ప్రముఖ సినీ ప్రముఖులతో గొప్ప సమావేశం” అని క్యాప్షన్ ఇచ్చారు.
ఈ భేటీపై బాలీవుడ్ తారలు ఏం చెప్పారో తెలుసుకుందాం.
ప్రధానమంత్రితో తన సమావేశానికి సంబంధించిన మరొక చిత్రాన్ని పంచుకుంటూ కరణ్ జోహార్ ఇలా వ్రాశాడు, “మమ్మల్ని కలిసినందుకు చాలా థాంక్స్ సర్. ప్రధానమంత్రితో అభిప్రాయాలను పంచుకున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి మోడీని కలవడం, మాట్లాడడం గౌరవంగా భావిస్తున్నట్లు వరుణ్ ధావన్ రాశారు.
పోలీసులపై సినిమా తీసినందుకు మిమ్మల్ని ప్రధాని స్వయంగా మెచ్చుకోవడం చాలా బాగుంది అని రోహిత్ శెట్టి రాశారు. సిద్ధార్థ్ మల్హోత్రా మేము చెప్పిన అన్ని విషయాలు ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు సర్. ఇది గౌరవానికి సంబంధించిన విషయం. చిత్ర పరిశ్రమకు మీరు అందిస్తున్న సపోర్ట్‌కి కృతజ్ఞతలు” అన్నారు.
చిత్రనిర్మాత అశ్విని అయ్యర్ స్పందిస్తూ “ప్రధాని నరేంద్ర మోడీని కలవడం గౌరవంగా ఉంది. మా సమావేశాన్ని వేరే స్థాయికి తీసుకెళ్లే సంభాషణ జరిగింది. సినిమా పరిశ్రమ ద్వారా సమాజం బాగుపడుతుందనే చర్చ జరిగింది. ఈ విధంగా, చాలా మంది తారలు సోషల్ మీడియాలో ప్రధానమంత్రిని ప్రశంసించారు. తమ మనసులోని భావాలను వ్యక్తం చేశారు.
నరేంద్ర మోదీ 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు
2001లో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ మోడీ హవా కనిపించి దేశానికి ప్రధాని అయ్యారు. 2014 తర్వాత 2019లో కూడా గెలిచి మరోసారి ప్రధాని అయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా నరేంద్ర మోడీ దేశానికి ముచ్చటగా మూడో సారి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు.