పిఠాపురం ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

పిఠాపురం ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పిఠాపురం అభివృద్ధికి కృషి చేస్తానన్న పవన్‌ కల్యాణ్ మాటలకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. ఆదిశగా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై పిఠాపురం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు ఏపీ క్యాబినెట్‌ అమోదం తెలిపింది. పిఠాపురం నియోజకవర్గంలో సోమవారం పర్యటించిన పవన్ కళ్యాణ్ PUDAగా పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేస్తానని ప్రకటన చేసిన 48 గంటల్లోనే పిఠాపురంలో అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు క్యాబినెట్‌ అమోదం తెలిపింది. అలాగే పిఠాపురంలో 30పడకల ఆస్పత్రి నిర్మాణానికి ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. పిఠాపురం అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు క్యాబినెట్‌ అమోదం తెలపడం పట్ల స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా పిఠాపురం రూపు రేఖలు మారబోతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు ప్రతిపాదనపై చర్చ ఆసక్తికరంగా సాగింది. దాని షార్ట్ నేమ్.. పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ షార్ట్ నేమ్ ‘పాడా’ అనే వస్తుందని, దాంతో కన్‌ఫ్యూజ్ అవుతారని కొంతమంది ప్రశ్న లేవనెత్తారు. అప్పుడు పిఠాపురం స్పెల్లింగ్‌ ప్రకారం ‘పీడా’ అని పేరు పెడదామా? అన్న ప్రతిపాదన.. ఆ పేరు బాలేదని పవన్‌ చెప్పారు. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ పిఠాపురం అని పేరు పెడదామని అధికారులు ప్రతిపాదించారు.

పిఠాపురం తీర మెట్ట మైదానం కలిసిన ఏకైక నియోజకవర్గం. మూడు మండలాలు 52 గ్రామ పంచాయతీల గల పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీలు ఉన్నాయి. ఈనియోజకవర్గంలో సుమారు 4లక్షలు జనాభా ఉన్నారు. పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో ఈ నియోజకవర్గం నూతన అధికారులు సంతరించుకొనుంది.

Please follow and like us:
ఆంధ్రప్రదేశ్ వార్తలు