కల్కి చిత్రంలో ‘పెరుమాళ్లపాడు’ నాగేశ్వరస్వామి ఆలయం!

కల్కి చిత్రంలో ‘పెరుమాళ్లపాడు’ నాగేశ్వరస్వామి ఆలయం!

జూన్‌ 27న కల్కి 2898 ఏడీ
కల్కిలో పెరుమాళ్లపాడు ఆలయం
200 ఏళ్ల క్రితం ఇసుకలో కూరుకుపోయిన ఆలయం

రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమాను వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో అశ్వినీదత్‌ నిర్మించారు. సినీ ప్రియులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కల్కి సినిమా జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విదేశాల్లో సహా భారత్‌లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ పూర్తిచేసుకుంది. కల్కి షూటింగ్‌కి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కల్కి 2898 ఏడీ సినిమాలో నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలం పెరుమాళ్లపాడులోని నాగేశ్వర ఆలయాన్ని చిత్రీకరించినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌ మధ్య సీన్స్ ఉంటాయట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే.. జూన్ 27 వరకు ఆగాల్సిందే. 2020లో పెరుమాళ్లపాడు స్థానిక యువత ఇసుకలో కూరుకుపోయిన ఆలయాన్ని వెలికితీశారు. ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వంను స్థానికులు కోరారు. 200 ఏళ్ల క్రితం ఇసుక తుపాన్ల కారణంగా ఈ ఆలయం కూరుకుపోయింది. ఈ ఆలయం కింద వందల ఎకరాల మాన్యం ఉంది.

కల్కి 2898 ఏడీలోప్రభాస్ సరసన దీపిక పదుకొణె నటిస్తుండగా.. లోకనాయకుడ కమల్‌హాసన్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌, పశుపతి, దిశా పటానీ కీలక పాత్రలు చేశారు. ప్రభాస్‌ భైరవగా నటించిన ఈ చిత్రంలో ‘బుజ్జి’ అనే వాహనం కీలకంగా నిలవనుంది. ఇక తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లిష్‌తో సహా మరికొన్ని విదేశీ భాషల్లోనూ కల్కి చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Please follow and like us:
వార్తలు సినిమా