ఏపీలో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది.జూన్ 12న నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు తన టీంను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు.ఈ క్రమంలో ఏపీకి కొత్త చీఫ్ సెక్రటరీగా నీరభ్ కుమార్ ప్రసాద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. నీరభ్ కుమార్ 1987 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ అధికారిగా ఉన్న నీరభ్, ఇకపై చంద్రబాబుకు చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వర్తించనున్నారు.
ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి సెలవులపై వెళ్లారు. ఈ క్రమంలో ఆయనను బదిలీ చేసి నీరభ్ కుమార్ ను కొత్త సీఎస్ గా నియమించింది ప్రభుత్వం. కాగా, ఈ నెల 12న అమరావతిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార సభకు ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.