పుష్ప 2 గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ పుష్ప 2 పై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ తాను చూశానని.. అదిరిపోయిందంటూ చెప్పుకొచ్చారు.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ మూవీ పుష్ప 2. డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప చిత్రానికి సెకండ్ పార్ట్ కావడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమా గురించి వచ్చే అప్డేట్స్ కోసం వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ పుష్ప 2 పై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ తాను చూశానని.. అదిరిపోయిందంటూ చెప్పుకొచ్చారు.
ఈనెల 19న దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కాన్సర్ట్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన పుష్ప 2 సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పుష్ప 2 అస్సలు తగ్గేదే లే అనేలా ఉంటుందని అన్నారు. “నేను పుష్ప 2 ఫస్ట్ హాఫ్ చూశాను. సినిమా అదిరిపోయేలా వచ్చింది. ఇందులోని సీన్స్ అన్నీ చూశాక నా దిమ్మ తిరిగిపోయింది. పుష్ప వరల్డ్ ప్రారంభమయ్యాక ప్రతి సన్నివేశం ఇంటర్వెల్ లా ఉంటుంది. అడియన్స్ నిరాశ పరిచేలా ఒక్క సీన్ కూడా ఉండదు. దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చేసింది. అదే స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక అల్లు అర్జున్ యాక్టింగ్ అదరగొట్టేశాడు” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో పుష్ప 2 పై మరింత హైప్ నెలకొంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇందులో రష్మిక మందన్నా, సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ మొదటి సారి హైదరాబాద్ లో మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 19న గచ్చిబౌలి స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే పలు దేశాల్లో అనేక ప్రదర్శనలిచ్చిన దేవి శ్రీ ఇప్పుడు తొలిసారిగా హైదరాబాద్ లో కాన్సర్ట్ నిర్వహించనున్నారు.