ఢిల్లీ లిక్కర్ స్కాంతో ఎమ్మెల్సీ కవితకు సంబంధం లేకుంటే విచారణకు సహకరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రూ.100 కోట్ల నిధుల మళ్లింపులో ఆమె పాత్ర ఉందని ఈడీ విచారణలో తేలిందని చెప్పారు. స్కాంతో సంబంధం లేనప్పుడు కవిత 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేసిందని ప్రశ్నించారు. సాక్ష్యాలు తారుమారుచేయడం కూడా నేరమేనని అన్నారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామం ఉంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు అడగదని జీవన్ రెడ్డిl అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చి ఉంటే లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యేవని అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లో రాష్ట్రంపై కేంద్రం చూపుతున్న వివక్షను ప్రశ్నించడం, హక్కుల సాధనలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఏ హోదా లేనప్పుడే మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పుకునే కేసీఆర్.. ఇప్పుడు సీఎం అయ్యుండి తెలంగాణ హక్కుల్ని కాపాడుకోలేకపోవడం ఆయన అసమర్థతకు నిదర్శనమన్నారు. చట్టాలపై అవగాహన ఉన్నవారే చట్టసభల్లో ప్రాతినిధ్య వహించాలని సూచించారు.