తాజాగా వరుసగా వెలుగులోకి వస్తున్న సంఘటనలు చూసి మందు ప్రియులు భయపడే పరిస్థితి వచ్చింది. మొన్నటి మొన్న మహబూబాబాద్ పట్టణంలో ఓ బీరు బాటిల్‌లో చెత్తాచెదారం దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే తాజాగా ఇలాంటి ఓ సంఘటనే పెద్ద చర్చకు దారి తీసింది…
ఇటీవల మద్యం ప్రియులకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ముఖ్యంగా బీర్ తాగే వారు భయపడే పరిస్థితి వచ్చింది. అసలే మద్యం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసిందే. అలాంటి మద్యం కల్తీగా మారడంతో ఆరోగ్యాలు దెబ్బ తింటున్నాయి. బీరు సీసాల్లో చెత్తాచెదారం కనిపించడం ఇటీవల సర్వసాధారణంగా మారిపోయింది. దీంతో తయారీ విధానంపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా వరుసగా వెలుగులోకి వస్తున్న సంఘటనలు చూసి మందు ప్రియులు భయపడే పరిస్థితి వచ్చింది. మొన్నటి మొన్న మహబూబాబాద్ పట్టణంలో ఓ బీరు బాటిల్‌లో చెత్తాచెదారం దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే తాజాగా ఇలాంటి ఓ సంఘటనే పెద్ద చర్చకు దారి తీసింది. అయితే ఈసారి ఏకంగా బీర్‌లో బల్లి దర్శనమిచ్చింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
వివరాల్లోకి వెళితే.. మహబూబాద్ జిల్లా గూడురు మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు స్థానికంగా ఉన్న వైన్ షాప్‌లో బీర్ బాటిల్‌ను కొనుగోలు చేశాడు. దీంతో బాటిల్‌లో ఏదో చెత్త ఉన్నట్లు సదరు వ్యక్తికి అనుమానం వచ్చింది. దీంతో ఏంటా అని పరిశీలించగా బాటిల్‌లో ఉంది బల్లి కళేబరం అని తేలింది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న యువకుడు వెంటనే ఈ విషయాన్ని వైన్స్ నిర్వాహకుడికి తెలిపాడు. బీర్‌లో బల్లి రావడంపై నిర్వహకులను నిలదీయగా, కంపెనీ నుంచే అలా వచ్చిందంటూ సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. తమకు ఎలాంటి సంబంధం లేదని అతనికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు.
దీంతో ప్రస్తుతం ఈ సంఘటన నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బీరులో ఉన్న బల్లి కళేబరానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో ఆ వైన్స్‌లో గత కొన్ని రోజులుగా బీర్ తాగిన మద్యం ప్రియులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బల్లి ఉన్న బీర్‌నే తాము తాగామా అని భయందోళన చెందుతున్నారు. అయితే ఈ వ్యవహారాలపై మద్యం తయారీ సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి.