బాహుబలి1, బాహుబలి 2 సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. దాంతో దేశవ్యాప్తంగా ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆతర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్ని పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అయ్యాయి. ఇక చాలా కాలం తర్వాత ప్రభాస్ సలార్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ప్రభాస్. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ అంచలంచలుగా పెరిగిపోతుంది. బాహుబలి సినిమా కంటే ముందు టాలీవుడ్ స్టార్ హీరోగా రాణించిన డార్లింగ్ బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. బాహుబలి1, బాహుబలి 2 సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. దాంతో దేశవ్యాప్తంగా ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆతర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్ని పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అయ్యాయి. ఇక చాలా కాలం తర్వాత ప్రభాస్ సలార్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ప్రభాస్. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సలార్ సినిమాను కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక రీసెంట్ గా కల్కి సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు రెబల్ స్టార్.
ఇక కల్కి సినిమాలో భైరవ పాత్రలో అద్భుతంగా నటించి ఆకట్టుకున్నాడు ప్రభాస్. ఇక ఇప్పుడు ప్రభాస్ వరుసగా సినిమాలు లైనప్ చేశారు. సలార్ 2, కల్కి 2లతో పాటు రాజా సాబ్, స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ గురించి ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్యామలా దేవి మాట్లాడుతూ ప్రభాస్ ను అల్లూరి సీతారామరాజు పాత్రలో చూడాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారని తెలిపారు.
తాజాగా శ్యామలా దేవి మాట్లాడుతూ.. గతంలో కృష్ణం రాజు అల్లూరి సీతారామరాజు పాత్రలో సినిమా చేయాలని అనుకున్నారు. కానీ ఇంతలో కృష్ణ గారు ఈ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమాలో కృష్ణగారు బాగా నటించారు. ఇక ఇప్పుడు ప్రభాస్ ను అల్లూరి సీతారామరాజుగా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫ్యాన్స్ విన్నపాన్ని ప్రభాస్ కు చెప్తాను అని అన్నారు శ్యామలా దేవి. ప్రభాస్ ఇప్పటివరకు రాముడిగా కనిపించి ఆకట్టుకున్నారు. మరి ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గా ప్రభాస్ నటిస్తాడేమో చూడాలి. ఇక కల్కి సినిమా జూన్ 27న విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు రూ. 750కోట్లకు పైగా వసూల్ చేసింది ఈసినిమా.