సూర్య, కార్తీక్ సుబ్బరాజు మూవీ ఆ బ్యాక్ డ్రాప్ లో రాబోతుందా..?

సూర్య, కార్తీక్ సుబ్బరాజు మూవీ ఆ బ్యాక్ డ్రాప్ లో రాబోతుందా..?

భారీ స్థాయిలో తెరకెక్కుతున్న “సూర్య 44 ” మూవీ
డ్యూయల్ రోల్ లో అలరించనున్న సూర్య

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కంగువ”..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీగా వస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ అండ్ యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై జ్ఞానవేల్ రాజా , వంశికృష్ణ రెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే యానిమల్ మూవీ ఫేమ్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.అయితే కంగువ మూవీ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు.

తాజాగా సూర్య మరో సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టేశారు.సూర్య తన తరువాత సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ అయిన కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ చిత్రం సూర్య కెరీర్ లో 44 వ చిత్రంగా తెరకెక్కుతుంది..ఈ సినిమా షూటింగ్ జూన్ 2 న గ్రాండ్ గా మొదలైంది.ఈ సినిమాలో సూర్య సరసన బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.అయితే దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాలో సూర్య పాత్రను ఎంతో డిఫరెంట్ గా డిజైన్ చేసారు.ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగనుందని సమాచారం.ఈ సినిమాలో సూర్య వింటేజ్ లుక్ లో లాంగ్ హెయిర్,గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు.దీనితో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

Please follow and like us:
వార్తలు సినిమా సినిమా వార్తలు