ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ ముఖ్యమైన భాగమైంది. అది లేకపోతే ఒక్క పనిని కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే ఫోన్ పనికి వచ్చేది. ఆ తర్వాత పాటలను రికార్డు చేసుకుని వినే అవకాశం కలిగింది. కానీ ఇప్పుడు ప్రతి పనికీ అత్యవసరంగా మారింది. గతంలో బయటకు వెళ్లేటప్పుడు జేబులో డబ్బులను చూసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు స్టార్ట్ ఫోన్ ఉంటే చాలు. అన్ని ఆర్థిక లావాదేవీలు చిటికెలో పూర్తి చేయవచ్చు.
ప్రస్తుతం పోర్టబుల్ (మడత పెట్టుకునే) ఫోన్లకు ఆదరణ పెరుగుతోంది. పలు ప్రముఖ బ్రాండ్లు వీటిని మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫినిక్స్ కంపెనీ కూాడా జీరో ఫ్లిప్ పేరుతో పోర్టబుల్ ఫోన్ ను ఆవిష్కరించింది. చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ కు మన దేశంలో ఆదరణ ఎక్కువగా ఉంటుంది. దీని నుంచి విడుదలైన ఫోన్ల అమ్మకాలు జోరుగా సాగుతాయి. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ తొలి ఫోర్టబుల్ ఫోన్ ను జీరోఫ్లిప్ పేరుతో దేశ మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ధరను రూ.49,999గా నిర్ణయించారు. అక్టోబర్ 22వ తేదీ మధ్యాహ్నం నుంచి ఫ్లిప్ కార్డు లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఫోన్ లాంచ్ సందర్భంగా కంపెనీ కొన్ని బ్యాంకు ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డు హోల్డర్లు రూ.3250 వరకూ తగ్గింపును పొందవచ్చు.
ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ పోర్టబుల్ ఫోన్ లో అనేక ప్రత్యేకతులు ఉన్నాయి. అతిపెద్ద కవర్ డిస్ ప్లే, 4720 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ. 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజీ, మీడియా టెక్ డైమెన్సిటీ 8020 చిప్ సెట్ ను ఏర్పాటు చేశారు. అలాగే 6.9 అంగుళాల హెచ్ డీ అమోలెడ్ స్క్రీన్, 3.64 అంగుళాల అమోలెడ్ కవర్ డిస్ ప్లేతో డ్యూయల్ డిస్ ప్లే సెటప్ ఆకట్టుకుంది. 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటుతో విజువల్స్ చాలా చక్కగా కనిపిస్తాయి. జీరోఫ్లిప్ ఫోన్ కేవలం 7.64 ఎంఎం మందం, 195 గ్రాముల బరువు ఉంటుంది. దీనిలో ప్రత్యేక మైన హూపర్ మోడ్ ను తీసుకువచ్చారు. రాక్ బ్లాక్, బ్లొసమ్ గ్రో రంగులలో అందుబాటులో ఉంది. 70 డబ్ల్యూ చార్జర్ తో బ్యాటరీని కేవలం 17 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ చేసుకోవచ్చు.
కెమెరా విషయంలో అదరహో అనిపించేలా తీర్చిదిద్దారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 50 మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ లెన్స్ తో కూడిన 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ తో పనిచేసే డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఏర్పాటు చేశారు. లోపలి డిస్ ప్లేలో ఫ్రంట్ ఫేసింగ్ 50 మెగా పిక్సెల్ కెమెరాతో సెల్పీలు చాలా నాణ్యతగా తీసుకోవచ్చు. ముందు, వెనుక కెమెరాలు 4కే వీడియో రికార్డింగ్ కు మద్దతు ఇస్తాయి. అదనంగా ఏఐ వ్లాగ్ మోడ్ ఫీచర్ కూాడా ఉంది.