ఇంగ్లండ్‌తో సెమీస్ మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే.. ఆ సీనియర్ ఆటగాడిపై వేటు

ఇంగ్లండ్‌తో సెమీస్ మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే.. ఆ సీనియర్ ఆటగాడిపై వేటు

గత 11 ఏళ్లుగా టీమిండియా ఐసీసీ కప్ అందుకోలేదు. ఈ కరువుకు తెరదించే అవకాశం మరోసారి భారత జట్టుకు లభించింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్‌కి భారత జట్టు రెండు అడుగుల దూరంలో ఉంది.

ICC T20 world cup India vs England Playing XI: గత 11 ఏళ్లుగా టీమిండియా ఐసీసీ కప్ అందుకోలేదు. ఈ కరువుకు తెరదించే అవకాశం మరోసారి భారత జట్టుకు లభించింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్‌కి భారత జట్టు రెండు అడుగుల దూరంలో ఉంది. సెమీస్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. జూన్ 27న రాత్రి 8 గంటలకు ఈ నాకౌట్ మ్యాచ్ జరగనుంది. 2022 టీ20 ప్రపంచకప్‌ సెమీస్ లో భారత్‌ను ఇంగ్లండ్ ఓడించింది. టీమిండియా విధించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. ఈ ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఈ టోర్నీలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ఇక గత రికార్డుల విషయానికి వస్తే.. టీ20 క్రికెట్‌లో ఇరు జట్లు 23 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 12 మ్యాచ్‌లు గెలవగా, ఇంగ్లండ్ 11 మ్యాచ్‌లు గెలిచింది. టీ20 ప్రపంచకప్‌లో రెండుసార్లు తలపడగా, ఇరు జట్లు చెరొక సారి విజయం సాధించాయి. కాగా ఇంగ్లండ్ తో సెమీస్ మ్యాచ్ కు భారత జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది.

సెమీఫైనల్లో రోహిత్ శర్మపై మరోసారి అంచనాలు పెరిగాయి. ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ 92 పరుగులు చేశాడు. అయితే మరోవైపు విరాట్ కోహ్లి ఫామ్ ఆందోళన పెంచుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో మొత్తం 66 పరుగులు చేశాడు కోహ్లీ. కాబట్టి, అతనికి బదులుగా టీ20ల్లో విజయవంతమైన జైస్వాల్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇలా జరిగితే కోహ్లీ వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వస్తాడు. సూర్యకుమార్ యాదవ్‌, రిషభ్ పంత్ లు ఫామ్ లో ఉన్నారు. అయితే శివమ్ దూబే స్థానంలో యశస్వి లేదా సంజూ శాంసన్‌లను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక స్పిన్నర్ల బాధ్యత రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ భుజస్కంధాలపై ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లు ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి నేతృత్వం వహిస్తారు.

భారత్ జట్టు ప్లేయింగ్-XI (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.

Please follow and like us:
క్రీడలు వార్తలు