మీ జ్ఞాపకశక్తిని రెట్టింపు చేసే ఆహారాలు.. చదువుకునే పిల్లలకు అలర్ట్!

మీ జ్ఞాపకశక్తిని రెట్టింపు చేసే ఆహారాలు.. చదువుకునే పిల్లలకు అలర్ట్!

మన శరీరం పనిచేయడానికి శక్తి ఎంత అవసరమో, మన మెదడు కూడా బాగా పనిచేయడానికి సరైన పోషకాహారం అవసరం. అందుకే మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా అవసరం. వాస్తవానికి, మెదడు తలలోని పుర్రె ద్వారా రక్షించబడుతుంది. అలాగే ఇది అన్ని ఇంద్రియాలకు ప్రధాన కేంద్రంగా పని చేస్తుంది. మెదడు తనను తాను రిపేర్ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ఇప్పటికే అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే మన మెదడు మరింత చురుకుగా ఉండాలంటే పోషకాలు అందించే ఆహారం తీసుకోవాలి. ఇందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జ్ఞాపకశక్తిని పెంచడానికి ఏ యే ఆహారాలు రోజూ తినాలి వంటి విషయాలు తెలుసుకుందాం..

వాల్‌నట్ – వేరుశెనగ
వాల్‌నట్స్‌లో మెదడుకు మేలు చేసే ఒమేగా-3 వంటి పోషకాలు ఉంటాయి. వాల్ నట్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. అలాగే వేరుశెనగ పప్పు కూడా మెదడుకు మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాటిల్లో మంచి కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.

బీన్స్ – గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్
బీన్స్ లో ఫైబర్, బి విటమిన్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఆకుకూరల్లో విటమిన్ ఇ, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు అభివృద్ధికి సహాయపడతాయి. ముఖ్యంగా కాలీఫ్లవర్, బ్రోకలీ మెదడు ఆరోగ్యానికి సహాయపడతాయి. ఈ కూరగాయలలో కోలిన్ అధికంగా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని బలపరుస్తుంది. ఆలోచనా సామర్థ్యాన్ని కూడా పదును పెడుతుంది.

బ్లూబెర్రీ
మెదడు ఆరోగ్యానికి బెర్రీలు మంచివి. ఇవి మెదడులో జ్ఞాపకశక్తి కోల్పోకుండా చేసి, నరాల పనితీరు, కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

కాఫీ-టీ
వీటిలో ఉండే కెఫిన్ మెదడుకు పదును పెట్టి అలసటను తగ్గిస్తుంది. గ్రీన్ టీ మానసిక ఆరోగ్యానికి కూడా ప్రభావవంతంగా ఉంటుంది. కానీ దాని అధిక వినియోగం మంచిది కాదు.

Please follow and like us:
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు