ట్రంప్‌ ఎఫెక్ట్‌.. మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ట్రంప్‌ ఎఫెక్ట్‌.. మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ప్రస్తుతం బంగారం ధరలు భారీగా దిగి వచ్చాయి. భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. కానీ నవంబర్‌ 7వ తేదీన రాత్రి 8 గంటల సమయానికి భారీగా తగ్గుముఖం పట్టింది..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపొందిన తర్వాత బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, గురువారం దేశ రాజధానిలో బంగారం మరియు వెండి ధరలు క్షీణించాయి. మూడు రోజుల్లో రూ.3750 పతనమై రూ.79,500 మార్కుకు చేరుకుంది. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం తులం ధరపై భారీగా తగ్గుముఖం పట్టింది. ఏకంగా రూ.17,90 పతనమై రూ.78,710 వద్దకు చేరుకుని ప్రస్తుతం రూ.80వేల దిగువకు పడిపోయింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,150 వద్ద కొనసాగుతోంది. అలాగే బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.81,150 వద్ద కొనసాగింది. మరోవైపు కిలో వెండి ధర రూ.3000 తగ్గుముఖం పట్టి ప్రస్తుతం రూ.93,800 వద్ద కొనసాగుతోంది. బుధవారం కిలో వెండి ధర రూ.96,000 వద్ద స్థిర పడింది. గ్లోబల్ ట్రెండ్ తగ్గుముఖం పట్టడంతో సెంటిమెంట్ బలహీనపడిందని, స్థానిక ఆభరణాల వ్యాపారుల్లో డిమాండ్ పడిపోవడంతో బంగారం ధరపై ఒత్తిడి పెరిగిందని వ్యాపారులు తెలిపారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్‌ను వ్యాపార వర్గాలు ఎక్కువగా ఇష్టపడుతున్నాయి. అందువల్ల పెట్టుబడిదారులు బంగారం లోహానికి బదులుగా బిట్‌కాయిన్, ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి ఎంచుకుంటున్నారు. దీంతో బంగారం ధర తగ్గిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ తెలిపారు. యుఎస్ బాండ్ లాభాలు, డాలర్ విలువ పెరుగుదల కూడా ఎల్లో మెటల్ ధర తగ్గుదలను ప్రభావితం చేశాయని తెలిపారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,710 వద్ద ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,560 వద్ద ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,560 వద్ద ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,560 వద్ద ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,560 వద్ద ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,560 వద్ద కొనసాగుతోంది.

Please follow and like us:
బిజినెస్ వార్తలు