బంగారం ధరలో ప్రతీ రోజూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒకానొక సమయంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 80 వేల మార్క్‌కు చేరుకుంటోందని చాలా మంది భావించారు. అయితే ఆ తర్వాత బంగారం ధర క్రమంగా తగ్గడం లేదా స్థిరంగా కొనసాగుతూ వచ్చింది. తాజాగా మంగళవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,940గా ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ. 73030 వద్ద కొనసాగుతోంది. మరి ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
- దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67090కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,180 వద్ద కొనసాగుతోంది.
- దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,940గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73030 వద్ద కొనసాగుతోంది.
- చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,940గా ఉండగా,24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73030 వద్ద కొనసాగుతోంది.
- ఇక కోల్‌కతా విషయానికొస్తే ఇక్కడ ఆదివారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,940, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73030గా నమోదైంది.
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,940కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73030 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్ విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,940కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73030 వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడతో పాటు, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
వెండి ధరలోనూ తగ్గుముఖం కనిపించింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో మంగళవారం కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. ఢిల్లీతోపాటు, ముంబయి, కోల్‌కతా, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 87,800 వద్ద కొనసాగుతోంది. కాగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు.. చెన్నై, కేరళ వంటి నగరాల్లో కిలో వెండి ధర గరిష్టంగా రూ. 92,800 వద్ద కొనసాగుతోంది.