మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు

మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల ఆరంభం నుంచి తీవ్ర ఒడిదొడుకుల నడుమ కదలాడుతున్న బంగారం రేట్లు ఈ వారంలో సడెన్ షాకిచ్చాయి. ఈ ఒక్క వారం లోనే వెండి, బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. గత వారంలో వరుస సెషన్స్ లో పైపైకి వెళ్లిన గోల్డ్ రేట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.

బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతు వస్తున్న పసిడి ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. నవంబర్‌ 29వ తేదీన బంగారం, వెండి ధరలు తగ్గాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,920 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,340 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కాగా, ఈ బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. అందుకే వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవడం ముఖ్యం. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా ఉండవచ్చు.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ప్లాన్‌ల కారణంగా ప్రపంచ అనిశ్చితి పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. ఇటీవలి US ఆర్థిక డేటా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత తగ్గించే అవకాశం తగ్గించింది. దీంతో ఇన్వెస్టర్లు బంగారం, వెండి పట్ల ఉదాసీనంగా ఉన్నారు. ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌లో కమోడిటీ అండ్ కరెన్సీ వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది మాట్లాడుతూ.. బంగారం ధరలు చాలా అస్థిరతను చవిచూశాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య మొదట్లో బలహీనంగా ఉన్నప్పటికీ త్వరగా కోలుకుందన్నారు. తర్వాత బంగారన్ని సురక్షితమైన పెట్టుబడిని ప్రోత్సహించిందన్నారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,340 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,920 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,340 ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,040 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,490 ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,340 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,340 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,340 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,340 ఉంది.
ఇక వెండి ధర విషయానిస్తే ప్రస్తుతం దేశంలో కిలో వెండిపై భారీగానే తగ్గుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.89,400 వద్ద కొనసాగుతోంది.

Please follow and like us:
బిజినెస్ వార్తలు